ఒకప్పుడు రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట , ఆ తర్వాత వైసిపి పార్టీకు కంచుకోటగా ఉండేది. కానీ 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఒక సంచలనం సృష్టించి రాయలసీమ నుంచి 45సీట్లను గెలిచింది. సాధారణంగా పశ్చిమగోదావరి ,తూర్పుగోదావరి జిల్లాల మెజారిటీ ఏ వైపుగా ఉంటే వారే అధికారంలోకి వస్తూ ఉంటారు. మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది మాత్రం సీమలోనే అని చెప్పవచ్చు. అలాంటి సీమలో 52 సీట్లకు గాను 45 స్థానాలను గెలిచింది..4 సీట్లు బిజెపికి రాగా ఒక సీటు జనసేన పార్టీ గెలుచుకుంది. కేవలం వైసీపీ పార్టీ 7 సీట్లకే పరిమితం కావడం జరిగింది.


2029 ఎన్నికలలో తిరిగి మళ్లీ ఆ 45 సీట్లను గెలుచుకోవడానికి కూటమి ప్లాన్ చేస్తోంది. వైసిపి తిరిగి పుంజుకొనివ్వకుండా వరుస కార్యక్రమాలను ఇక్కడ చేసేలా పక్క ప్రణాళికలతో కూటమి ముందుకు వెళ్తోంది. టిడిపి మహానాడు సభను కూడా రాయలసీమలోనే పెట్టి సక్సెస్ చేశారు. ఆ తర్వాత జగన్ సొంత అసెంబ్లీ అయినా పులివెందల, ఒంటిమిట్ట ప్రాంతంలో జడ్పిటిసి ఉపఎన్నికలు జరగక  టిడిపి గెలిచింది.పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం వరుస టుర్లతో సీమలో బిజీగా ఉన్నారు. బిజెపి కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికైన pvn. మాధవ్ కూడా సీమ నుంచి పలు రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు.. ఇలా కూటమిలో మొత్తం అంతా కూడా వైసీపీ ఓటు బ్యాంకు మీద పెద్ద ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది.


సీఎం చంద్రబాబు కూడా తన వ్యూహాలతో ముందుకు వెళ్లేలా చూస్తున్నారు. పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూ సీమలో కూడా డెవలప్మెంట్ చేస్తూ ప్రాజెక్టులతో పరుగులు పెట్టిస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కుప్పంకు నీళ్లు తెప్పించడమే కాకుండా కడపలో ఒక ఉక్కు ప్రాజెక్టును తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు. అలాగే సీమలో ఎక్స్ప్రెస్ హైవేల పనులు స్పీడుగా జరిగేలా చూస్తున్నారు. వీటికి తోడు నామినేటెడ్ పోస్టులలో సీమకు 30 శాతం వరకు కేటాయించారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడు రానంతగా గెలిచిన తర్వాత ఒక ఏడాదిలోనే పదిసార్లు పైన రాయలసీమలో పర్యటించారు. ఎన్నికలలో హామీ చెప్పిన విధంగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చిన సందర్భంగా అనంతపురంలో విజయోత్సవ సభను కూడా రేపటి రోజున ప్లాన్ చేశారు. ఇలా 2029 ఎన్నికలకు త్రిముఖ వ్యూహం ద్వారా ముందుకు వెళ్లేలా కూటమి పార్టీలు వెళుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: