`హ‌నుమాన్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనంత‌రం టాలీవుడ్ యంగ్ స్టార్ తేజ స‌జ్జా నుంచి రాబోతున్న మ‌రో పాన్ ఇండియా మూవీ `మిరాయ్‌`. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ ఫిల్మ్ ఇది. రితికా నాయక్ హీరోయిన్ కాగా.. మంచు మ‌నోజ్ విల‌న్ గా న‌టించాడు. శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. సుమారు రూ. 60 కోట్ల బ‌డ్జెట్ తో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ మూవీ సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.


ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన కంటెంట్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అందుకు త‌గ్గ‌ట్లుగానే నాన్‌ థియేట్రికల్, థియేట్రిక‌ల్‌ బిజినెస్ క‌ళ్లు చెదిరే రేంజ్‌లో జ‌రుగుతోంది. ఇక‌పోతే రీసెంట్‌గా మేక‌ర్స్ విడుద‌ల చేసిన ట్రైల‌ర్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తేజ ఖాతాలో మ‌రో హిట్ ఖాయ‌మ‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగించింది. అయితే ఇప్పుడు మిరాయ్ విష‌యంలో రెండు సెంటిమెంట్స్ ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి.


ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణించిన శ్రియా.. పెళ్లి త‌ర్వాత ఇక్క‌డ జోరు త‌గ్గించింది. తెలుగులో ఆర్ఆర్ఆర్ త‌ర్వాత శ్రియా చేసిన మూవీ మిరాయ్‌. ఇందులో తేజ‌కు త‌ల్లిగా ఆమె న‌టించారు. అయితే గ‌తంలో `బాలు`, `ఛత్రపతి` చిత్రాల్లోనూ శ్రియా, తేజ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. అదేవిధంగా సెప్టెంబర్ అనేది శ్రియకు ల‌క్కీ మంత్‌. ఈ నెలలో ఆమె హీరోయిన్ గా యాక్ట్ చేసిన `ఠాగూర్`, `చెన్నకేశవరెడ్డి`, `ఛత్రపతి` సినిమాలు విడుదలై సూప‌ర్ డూప‌ర్ హీట్స్ గా నిలిచాయి. సో.. సెప్టెంబ‌ర్ మంత్‌, తేజ‌-శ్రియా కాంబో.. ఈ రెండు సెంటిమెంట్స్ రిపీట్ అయితే మిరాయ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయ‌మని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుత‌న్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: