అమెరికా, ఇండియా పైన సుంకాలు విదించిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు కూడా క్షీణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెరికా వీసా నిబంధనలను కూడా చాలా కఠినంగా చేసింది. ఇకమీదట ఇండియాతో సహా నాన్ - ఇమిగ్రెంట్ వీసా కు దరఖాస్తు చేసుకునే వారికి ఒక భారీ షాక్ ఇచ్చింది. అదేమిటంటే"ఇంటర్వ్యూ కోసం వారి దేశంలో లేదా చట్టబద్ధమైన నివాస స్థలంలో మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోవాలని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది".



ఈ మేరకు సోమవారం రోజున అధికారికంగా ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఇది వెంటనే అమలులోకి తీసుకువచ్చేలా చేసింది అమెరికా. దీనివల్ల వీసా దరఖాస్తు చేసుకునేవారు తమ దేశం లేదా యూఎస్ ఎంబసీలో మాత్రమే ఇంటర్వ్యూకు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా వేరే దేశాల నుంచి ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఈ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అనేది విదేశీయులకు తాత్కాలికంగా ప్రయోజనం కోసం. ఈ వీసా వల్ల అమెరికాలో కొద్దిరోజులు ఉండవచ్చు. అలాగే ఇది వ్యాపార, పర్యటక, వైద్య చికిత్సలు మరికొన్ని పనులకు మాత్రమే ఇది ఇస్తారట.

అయితే ఇప్పుడు అమెరికా తాజా నిబంధనలతో ఇది భారత్ పైన చాలా ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. థాయిలాండ్, సింగపూర్, జర్మనీ వంటి ప్రాంతాలలో ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల వారి వీసా దరఖాస్తు కూడా పెండింగ్లోనే ఉంటాయి. ఇక అమెరికాకు వెళ్లాలనుకొనే భారతీయులు విదేశాలలో ఎక్కువగా B1 (బిజినెస్),B2(టూరిస్ట్) వంటి వీసాల అపాయింట్మెంట్ పొందలేరు. గతంలో కూడా ఇండియాలో వీసా ఇంటర్వ్యూలకు ఎక్కువ సమయం పట్టేది. అందుకోసమే భారతీయులు ఎక్కువగా విదేశాలకు ఇంటర్వ్యూ కోసం వెళ్లేవారు. కానీ ఇకమీదట ఇండియాలోనే వారు ఇంటర్వ్యూకు షెడ్యూల్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా చేస్తున్న ఈ కఠినమైన నిర్ణయాలు ఇండియాని ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: