
అమెరికా చర్యలు వాణిజ్య రంగంలో కొత్త సమస్యలకు దారి తీసినా, భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా దెబ్బకు దెబ్బ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అమెరికా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేయడంతో పాటు రష్యాతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుని అక్కడి నుంచి భారీ స్థాయిలో చమురు దిగుమతి చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా నైజీరియాతో కూడా క్రూడ్ ఆయిల్ సరఫరా కోసం ప్రత్యేక డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇది భారత్ తీసుకున్న ఒక కీలకమైన వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ టెక్నిక్ ఇటీవల భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలని కండిషన్ పెట్టారు. అయితే మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా దేశ ప్రయోజనాల కోసం తాము అనుకున్న దారిలోనే ముందుకు వెళ్తోంది. ఈ నిర్ణయాలు అమెరికాకు స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి—భారత్ ఇకపై ఎవరినీ ఆధారపడే దేశం కాదని, తన ఆర్థిక, వ్యూహాత్మక నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని.
భారత్ ధైర్యవంతమైన ఈ నిర్ణయాలకు దేశ ప్రజల మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియాలో "We Are Indians", "This Is india Power"వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. అనేకమంది నెటిజన్లు మోదీ తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. "అమెరికా తానేంటో ప్రూవ్ చేసుకోవచ్చు… కానీ భారత్‌కి తిక్క రేగితే ఇలాగే ఉంటుందనేది మోదీ చూపించాడు" అంటూ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా తన వైఖరిని కొంత సాఫ్ట్ చేస్తూ భారతదేశంతో మళ్లీ సత్సంబంధాలు కొనసాగించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ మోదీ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తీసుకుంటున్న ఈ దూకుడైన నిర్ణయాలు దేశ ప్రతిష్టను మరింత పెంచుతున్నాయి.
మొత్తం మీద మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక చర్యలు అమెరికాకు గట్టి సందేశం పంపినట్టే. భారత్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లో తన స్థాయిని ప్రూవ్ చేసుకుంది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ, ఆర్థిక పరిణామాలు ప్రపంచ వేదికపై కీలక మలుపులు తిప్పే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.