
బ్లూ చీజ్‌లో శక్తిని అందించే మంచి కొవ్వులు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, రోజు మొత్తం చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. బ్లూ చీజ్ కాల్షియంతో సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది, ఎముకలు బలహీనపడకుండా కాపాడుతుంది. కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది. దీన్ని తినడం వల్ల ఆస్టియోపొరాసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
ఇందులో ఉండే మంచి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. బ్లూ చీజ్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు, మరియు ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బ్లూ చీజ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా మరియు వైరస్‌ల పెరుగుదలను అడ్డుకుంటుంది. దీనివల్ల వివిధ వ్యాధులు రాకుండా మనం జాగ్రత్తపడవచ్చు.
బ్లూ చీజ్‌లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడి, ఆహారం సులభంగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. బ్లూ చీజ్‌లో తక్కువ కార్బోహైడ్రేట్లు మరియు ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. దీనివల్ల చాలా సమయం కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది.