కొన్ని సులువైన చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో ఎలుకలకు సులువుగా చెక్  పెట్టే  ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.  లుకలకు పెప్పర్‌మింట్ వాసన అస్సలు నచ్చదు. కాబట్టి, దూది ముక్కలను పెప్పర్‌మింట్ ఆయిల్‌లో ముంచి, ఎలుకలు వచ్చే అవకాశం ఉన్న చోట్ల పెట్టండి. కిటికీలు, తలుపులు, పగుళ్లు, లేదా గది మూలల్లో వీటిని ఉంచడం వల్ల అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

 ఉల్లిపాయల ఘాటైన వాసన ఎలుకలను దూరంగా ఉంచుతుంది. ఒక ఉల్లిపాయను కట్ చేసి, ఎలుకలు తిరిగే ప్రదేశంలో పెట్టండి. అయితే, ఉల్లిపాయ త్వరగా కుళ్లిపోతుంది కాబట్టి, ప్రతిరోజూ మార్చడం అవసరం. పుదీనా ఆకులను ఎలుకలు ఎక్కువగా తిరిగే మార్గంలో ఉంచండి. వాటి వాసనను ఎలుకలు తట్టుకోలేవు. పుదీనా పొడిని కూడా ఉపయోగించవచ్చు.  

మిరపకాయ పొడిని ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో చల్లడం వల్ల వాటికి చికాకు కలిగి ఇంట్లోకి రావు. అయితే, ఇంట్లో పెంపుడు జంతువులు లేదా పిల్లలు ఉంటే ఈ పద్ధతిని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిట్కాలతో పాటు, మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆహార పదార్థాలను గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయండి. ఇల్లంతా పరిశుభ్రంగా ఉంటే ఎలుకలు ఉండే అవకాశం చాలా తక్కువ.

ఈ సులభమైన చిట్కాలతో ఎటువంటి రసాయనాలు లేకుండా ఎలుకల బెడదను తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతులు మీకు పని చేయకపోతే పెస్ట్  కంట్రోల్ నిపుణులను సంప్రదించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: