వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఇటీవల పరిణామాలు రాజకీయంగా తీవ్రమైన ర‌చ్చ‌కెక్కాయి. నేపాల్ అల్ల‌ర్ల విష‌యంలో మ‌న రాష్ట్రానికి చెందిన ప‌లువురు తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిని ర‌క్షించుకోవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. అక్క‌డ చిక్కుకుపోయిన 22 మంది క‌డప జిల్లా వాసుల‌ను ఏపీకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసి వారిని ఎప్ప‌టిక‌ప్పుడు అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకుని తీసుకువ‌చ్చారు.


22 మంది కడపకు చెందిన ప్రజలు నేపాల్ లో చిక్కుకుపోతే ఆ జిల్లాకు చెందిన మాజీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ కనీసం స్పందించలేకపోయారని, ఒక్క మాట కూడా వారి గురించి చర్చించలేదని కనీసం వారికి ఫోన్ చేసి పరామర్శించలేదన్నద‌న్న ఆరోప‌ణ‌లు ఆ జిల్లా ప్ర‌జ‌ల్లోనే గ‌ట్టిగా ఉన్నాయి. ఇందులో నిజం కూడా ఉంది. నేపాల్ లో సంభవించిన అల్లర్లు ఇతర అంశాల కారణంగా చిక్కుకుపోయిన తెలుగువారి విషయంలో ప్రతిపక్ష పార్టీగా జగన్ ఇంతవరకు స్పందించలేదు. వారు అక్కడ అల్లర్లలో చిక్కుకోవడం వారిని సురక్షితంగా తీసుకురావడం అన్ని కూట‌మి మంత్రి, టీడీపీ యువ‌నేత నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగాయి. ఇందుకు కృతజ్ఞతగా వారంతా మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం కూడా చేశారు.


ఇంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి నేపాల్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయి తిరిగి వచ్చిన వారిని ఇప్పటివరకు పరామర్శించకపోవడం వైసీపీ వాళ్ల‌కే న‌చ్చ‌డం లేదు. నేపాల్ బాధితుల గురించి క‌నీసం ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం వంటివి చర్చకు దారితీసాయి. మరీ ముఖ్యంగా తన సొంత జిల్లా కడపకు చెందిన వారిని కూడా ఆయన పరామర్శించకపోవడం పట్ల స్థానికంగాను జ‌గ‌న్ తీరుపై అనేక విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. క‌డ‌ప వాళ్లు జ‌గ‌న్‌ను ఎంత నెత్తిన పెట్టుకున్నా జ‌గ‌న్‌కు ఉన్న ప్రేమ ఇదేనా అన్న కామెంట్లు ప‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: