సాధారణంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చి, వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోతే, ఇదే టైంలో ఎలక్షన్స్ జరిగి మరో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం ఆ పాత పనులను పట్టించుకోరు.. అది పేద ప్రజల కోసం చేసిన పనైనా సరే, ఆపోజిట్ పార్టీకే క్రెడిట్ వెళ్తుందని కొత్తగా గెలిచిన పార్టీలు కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడవు.. ఇలాంటి పరిస్థితులు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి రాజీవ్ గృహకల్ప పేరుతో ఎంతోమంది పేదలకు ఇండ్లు ఇచ్చారు.. మరికొన్ని ఇండ్లు సగం పూర్తయిపోయి అక్కడే ఆగిపోయాయి.. అయితే ఈ నిర్మాణాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించింది కూడా కేంద్రమే.. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వచ్చిన సీఎంలు కనీసం ఆ ఇండ్లను పూర్తి చేసి పేదలకు పంచాలనే ఆలోచన చేయకుండా ఆ క్రెడిట్ రాజశేఖర్ రెడ్డికి వెళ్లిపోతుందని అది అక్కడే పెట్టేస్తూ వచ్చారు.. ఆ విధంగా కేవలం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి చేసిన ఇండ్లే  కాదు, తెలుగుదేశం హయాంలో ఏదైనా అభివృద్ధి పని సగంలో ఆగిపోతే తర్వాత వచ్చిన జగన్ వాటిని అక్కడే వదిలేసారు.

 అలా జగన్ చేసిన సగం పనులను చంద్రబాబు కూడా పట్టించుకోవడం లేదు.. ఇలా పార్టీల మధ్య పంథాలకు పోయి ప్రభుత్వ ధనం వృధా చేయడమే కాకుండా పేదలకు కూడా అన్యాయం చేసే నాయకులు ఎందరినో మనం చూస్తున్నాం.. అంతేకాదు ప్రస్తుత కాలంలో కొంతమంది గెలిచిన నాయకులకు ఆ నియోజకవర్గ పరిస్థితులు కూడా సరిగ్గా అవగాహన ఉండదు..డబ్బులు పంచామా బ్రతిమిలాడామా, గెలిచామా.. డబ్బులు సంపాదించుకున్నామా..అనే రీతిలో మాత్రమే వ్యవహరిస్తున్నారు..మరి ఓట్లేసిన పేదలకు ఏం కావాలి వారి సమస్యలేంటి? వారి సమస్య తీరాలంటే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి ఆలోచన చేయడు.. ఏదైనా పథకం వస్తే దాన్ని పూర్తిస్థాయిలో పేదలకు పంపిణీ అవుతుందా లేదా అనేది ఆలోచించకుండా ఏదో తూ తూ మంత్రంగా పథకాన్ని ఓపెన్ చేసామా, వెళ్లిపోయామా..అనే రీతిలో మాత్రమే వ్యవహరిస్తూ ఉంటారు.. కానీ పూర్తిస్థాయిలో ఇది పేదలకు అందుతుందా లేదా అనేది చూసినప్పుడే ఆ ఎమ్మెల్యే పదవి సార్థకమవుతుంది.. మానవ జీవితంలో కూడు, గూడు, గుడ్డ అనేవి తప్పనిసరిగా ఉండాలి.

 ప్రస్తుతం రేషన్ బియ్యం అందించి పేదల ఆకలి తీరుస్తోంది ప్రభుత్వం. ఇక బట్టలు అంటే ఎవరికి వారే కొనుక్కోగలుగుతున్నారు.. ఇటు గూడు అనేది  చాలామందికి  ఇబ్బందితో కూడుకున్న పని. అలాంటి ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చాలామందికి ఇండ్లు అందిస్తున్నారు..అయితే ఇండ్ల విషయంలో తాజాగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ  పవన్ కళ్యాణ్ ముందు ఒక  విషయాన్ని నోటీసులో పెట్టారు. ఒకే ప్రాంతంలో ఉండే జనాలు ఒకరు కాకినాడ రూరల్ కింద ఉంటే మరొకరు కాకినాడ అర్బన్ కింద ఉంటారు. మధ్యలో ఉన్నది చిన్న రోడ్డు మాత్రమే.. ఇందులో అర్బన్ లో ఇల్లు కట్టుకునే 2.80లక్షలు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. రూరల్ లో ఉన్న వారికి 1,80,000 అందిస్తోంది. నిజానికి రూరల్ అర్బన్ కి మధ్య తేడా చిన్న రోడ్డు మాత్రమే.. కానీ పొద్దున లేస్తే చాలు వారంతా కలిసే ఉంటారు. అలాంటి ఈ తరుణంలో తాజాగా ఎమ్మెల్యే నానాజీ రూరల్ ప్రాంత వాసులకు కూడా అర్బన్ వాళ్లకి ఇచ్చినట్టుగానే డబ్బులు అందించాలని పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు. ఈ విషయాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ నోటీసులో పెట్టినందుకు చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేను అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: