సినీ పరిశ్రమలో కార్మికుల సంక్షేమానికి సైతం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు. ఇక మీదట ఏదైనా సినిమా టికెట్ ధరలను పెంచుకోవాలి అంటే ఆ పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో 20% వరకు సినీ కార్మికుల వెల్ఫేర్ కి అందించాలనే కండిషన్ ను విధించారు. ఈ షరతులను పాటిస్తే రాబోయే రోజుల్లో టికెట్ ధరలకు పెంపునకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఇటీవల యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో జరిగిన సినీ కార్మిక సంఘాల అభినందన మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొనగా మాట్లాడారు.


ఇక మీదట సినీ కార్మికులకు కలెక్షన్లలో వాటా ఇచ్చేందుకు అంగీకరిస్తేనే టికెట్ల రేటు పెంపు ఆమోదం ఉంటుందంటూ తెలియజేశారు. టికెట్ల రేటు పెరిగితే నిర్మాతలు, హీరోలకు డబ్బులు వస్తాయి కానీ కార్మికులకు ఏ విధంగా ఆ ఫలితం దక్కలేదని అందుకే ఇక మీదట టికెట్లు రేపు పెంచే జీవో ఇవ్వాలి అంటే 20% కార్మికులకు ఇవ్వాల్సిందే అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ కింద తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ .10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తున్నామంటూ తెలియజేశారు.


ప్రభుత్వం చేయగలిగిన పనులన్నీ కూడా చేస్తుందని త్వరలోనే సినీ కార్మికుల ఇళ్ల స్థలాలకు సంబంధించి అన్ని ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. సినీ కార్మికుల రూపురేఖలు మార్చేస్తామంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత,FDC చైర్మన్ దిల్ రాజ్ తో పాటు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ మరి కొంతమంది మంత్రులు పాల్గొన్నారు. ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినీ కార్మికులు కూడా ఆనంద పడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి, ఇందులో భాగంగా  సినీ కార్మికుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: