ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి హత్య సంచలనంగా మారింది. మహిళ లీవ్ ఇన్ రిలేషన్లో ఉంటూ మరి హత్య చేయించింది. ఎవరితో అయితే రిలేషన్లో ఉందో ఆ మహిళ, వారిని చంపడానికి పాత ప్రియుడు, కొత్త ప్రియుడుతో కలిసి చేసింది హత్య. లీవ్ ఇన్ రిలేషన్ అంటే ఎవరికి నచ్చినట్టుగా వారు ఉంటూ తమ జీవితాలను తాము అనుకున్నట్టుగా జీవించడమే. ఎన్ని రోజులైనా ఉండవచ్చు నచ్చకపోతే ఎవరు బ్రతుకు వారు బతుకుకోవచ్చు. ఎలాంటి కండిషన్స్ ఉండకూడదు. విచ్చలవిడిగా జీవితం కలిసి జీవిద్దాం అనే ఉద్దేశంతోనే ఈ రిలేషన్ లో ఉంటారు.



కానీ ఈ మధ్యకాలంలో ఈ రిలేషన్ ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఖర్చు నువ్వు పెట్టు నేను అనుభవిస్తా అనే తీరులో ప్రవర్తిస్తున్నారు. ఇది లీవ్ ఇన్ రిలేషన్ మారినటువంటి ట్రెండ్.ఈ ట్రెండ్ లో భాగంగానే అమృత అనే అమ్మాయి, ఏకంగా ముగ్గురు అబ్బాయితో కలిసి లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది. ఇందులో మరో విషయం ఏమిటంటే రామ్ కేష్ మీనా అనేటువంటి వ్యక్తితో కొన్నేళ్లపాటు రిలేషన్ లో ఉంది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి మరో కొత్త బాయ్ ఫ్రెండ్ తో లీవ్ ఇన్ రిలేషన్ లో ఉండాలనికుంది అమృత.


పాత బాయ్ ఫ్రెండ్ ని  వదిలించుకోవాలనుకుంది. కాని  వీళ్ల లీవ్ ఇన్ రిలేషన్ లో ఇద్దరు ఇష్టంతోనే అన్ని పనులు కానిచ్చేశారు, వీటికి సంబంధించి అన్నిటిని వీడియోలు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ తో లీవ్ ఇన్ రిలేషన్ లో ఉన్న సమయంలో ఇబ్బంది ఎదురవుతుందని పాత బాయ్ ఫ్రెండ్, కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్లాన్ చేసి మరి( రామ్ కేష్ మీనా) ను హత్య చేయించింది అమృత. దీనిని హత్యగా చిత్రీకరించాలని చూసినప్పటికీ..కానీ సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయారు. అమృతనే హత్య చేసినట్టుగా బయటపడింది. పెళ్లి అనే రిలేషన్లో భరోసా ఉంది, బాధ్యత ఉంది. ఏదైనా సరే అమ్మాయికి, అబ్బాయికి  రక్షణ కల్పించే విధంగా ఉంటుంది. లీవ్ ఇన్ రిలేషన్ లో  మాత్రం ఇలాంటివి ఏమీ కనిపించలేదు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలానే జరుగుతున్నాయి ఇలాంటి విషయాల పైన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: