జూబ్లీహిల్స్ ఉపఎన్నిక  సమయం దగ్గర పడుతోంది. ఇదే తరుణంలో ప్రచార హోరుని పెంచేశారు. ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు బిజెపి ఒకరికొకరు నువ్వా నేనా అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాంటి ఈ తరుణంలో చాలా చాలావరకు సర్వే సంస్థలు సర్వేలు చేసి పార్టీల బలబలాలను తెలియజేస్తున్నాయి. అలాంటి ఈ సమయంలో అక్కడ ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉంది.. ఏ పార్టీకి మైనస్ అవుతుంది అనే వివరాలు చూద్దాం.. జూబ్లీహిల్స్ లో మొత్తం దాదాపు నాలుగు లక్షలకి పైగా ఓటర్లు ఉన్నారు.. ఇందులో 2,08,000 పురుషులు, 1,92,000 మహిళలు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రతిసారి ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. 

2009లో 52%, 2014లో 50%, 2018లో 45%, 2023లో 47% పోలింగ్ జరిగింది. ఇక్కడ పోలింగ్ ఎంత శాతం జరుగుతుందనే దానిని బట్టే ఈసారి గెలుపు అనేది ఉంటుంది.. ముఖ్యంగా ఇక్కడ ముస్లిం ఓటర్లు 1,10,000 మందికి పైగా ఉన్నారు. కానీ ఇందులో సగం వరకే ఓట్లు పోల్ అవుతాయి.. ఇందులో ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ కే పడతాయని చాలామంది భావిస్తున్నారు. కానీ ముస్లింలలో చాలామంది మహిళలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.  దీనివల్ల ముస్లిం ఓట్లు చాలా వరకు చీలిపోతాయి. బీసీ ఓట్లు 1,60వేల వరకు ఉన్నాయి. కానీ ఇందులో లక్ష వరకు పోలవుతాయి. ఇక బీసీ ఓట్లు కూడా బీఆర్ఎస్ కు ఎక్కువ పడే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్ కు కాస్త తక్కువ పడే అవకాశం కనిపిస్తోంది. ఇక కమ్మ, సెటిలర్స్ ఓట్లు  35వేల వరకు ఉంటే 25 వేల వరకే పోలయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికే పోల్ అయ్యే అవకాశం ఉంది.  ఇలా ఏ వైపున చూసినా 60పర్సెంట్ బిఆర్ఎస్ అభ్యర్థికి  ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. దీనివల్ల సునిత గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ పోలింగ్ 50%కంటే ఎక్కువైందంటే అది కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలిచినా 2000 లోపే మెజారిటీనే ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి జూబ్లీహిల్స్ లో  ఏ పార్టీ జెండా పాతుతుంది అనేది మరికొన్ని రోజుల్లోనే బయటకు రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: