ఈ సమయంలో ఆలయంలో భక్తులు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఇనుప రైలింగ్ ఒక్కసారిగా విరగిపోవడంతో కొందరు భక్తులు పడిపోయారు. అదే వారు చేసిన బ్గ్ మిస్టేక్. ఒకరి మీద ఒకరు జనాలు పడిపోవడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ హడావిడిలోనే తొక్కిసలాట ప్రారంభమై, దురదృష్టవశాత్తు 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి లు స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో రైలింగ్ విరగిపోవడం ప్రమాదానికి కారణమని వారు వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ – “భక్తులు రైలింగ్‌ను పట్టుకుని నిలబడటంతో అది విరగిపోయింది. దాంతో కొందరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఆలయ నిర్వాహకులు భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసులను ముందుగా కోరలేదు,” అని తెలిపారు.
అయితే అక్కడ ఆలయ నిర్వాహకుల వర్షెన్ వేరే లా ఉంది. పర్మిషన్ తీసుకున్నాం అని కానీఇంత జనాభా వస్తారు అని తెలియదు అంటున్నారు. ఇంత భారీ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయారని వాళ్ళు పేర్కొన్నారు. ప్రతి ఏడాది కార్తీక మాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే విషయం తెలిసినా, ఈసారి ఏకాదశి మరియు శనివారం ఒకేసారి రావడంతో రద్దీ మరింత పెరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ప్రజలు, భక్తులు, స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. “ఇంత పెద్ద ఉత్సవం జరుగుతుందని ముందే తెలిసినా అధికారులు ఎందుకు తగిన భద్రతా చర్యలు చేపట్టలేదు?”, “భక్తుల ప్రాణాలు ఇలా వృథా కావడం ఎవరి నిర్లక్ష్యం వల్ల?” అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తి పేరుతో జనం తరలి రావడం ఒకవైపు ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం అయినప్పటికీ, మరోవైపు భద్రతా చర్యలు తగినంత లేకపోతే ఎంతటి విషాదం సంభవిస్తుందో కాశీబుగ్గ ఘటన మరలా స్పష్టంచేసింది. ఇప్పుడు ప్రజల మనసుల్లో ఒకటే ప్రశ్న – “ఇంత పెద్ద భక్తి స్రవంతి ఉన్నా భద్రతా బంధాలు ఎందుకు బలహీనమయ్యాయి?” అంటున్నారు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి