“ప్రజల సమస్యలపై మాట్లాడే ముందు ఇంటి సమస్యలు పరిష్కరించు కేటీఆర్!” అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో హోరెత్తించాయి. ఇదే సందర్భంలో రేవంత్ మరోసారి బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. “ఆస్తి వివాదం వెనుక కూడా రాజకీయ లాభాల కోసం బీజేపీతో కేటీఆర్ డీల్ చేసుకున్నాడు” అని రేవంత్ గుప్పెడు మంటలు విసిరారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ నేతల్లో ఆగ్రహం రేపగా, రాజకీయ విశ్లేషకులు మాత్రం - “రేవంత్ చెప్పినదాంట్లో కొంత వాస్తవం ఉందేమో!” అని అంటున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఇటీవల కవిత స్వయంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వివాదానికి బలం చేకూర్చాయి.
“నా బావ ఫోన్‌ను ఎవరు ట్యాప్ చేస్తున్నారు?” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కుటుంబంలో ఉన్న ఉద్రిక్తతలను స్పష్టంగా చూపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలతో ఈ అంతర్గత సమస్యలు ఇప్పుడు పబ్లిక్‌లోకి వచ్చి, కేటీఆర్ ప్రతిష్టకు దెబ్బ తగిలినట్లయ్యింది. అయితే రేవంత్ రెడ్డి ఇక్కడితో ఆగలేదు. “ప్రజలు కాంగ్రెస్‌కు మరో అవకాశం ఇవ్వాలి. అభివృద్ధి, పారదర్శకత, నిజాయితీతో పనిచేస్తాం. బీఆర్‌ఎస్ మాదిరిగా కుటుంబ పాలన కాదు, ప్రజా పాలన చూపిస్తాం” అని సభలో ప్రకటించారు. ఇక ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో చర్చల తుఫాను మొదలైంది. రేవంత్ రెడ్డి చేసిన కేటీఆర్–కవిత కామెంట్స్ బీఆర్‌ఎస్‌లో పెద్ద పగుళ్లు తెస్తాయా? లేక ఇది కేవలం రాజకీయ మలుపా? అనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలన్నీ దృష్టి సారించాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి