చిన్న చిన్న విషయాలకే చదువుకుంటున్న విద్యార్థుల సైతం క్షణికావేశంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా సూసైడ్ వంటివి చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా రాజస్థాన్లోని జైపూర్ లో ఒక పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి విద్యార్థి (అమైరా)5 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఆ విద్యార్థి చనిపోయిన తర్వాత పాఠశాల అధికారుల సైతం పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆ సంఘటన స్థలాన్ని శుభ్రం చేయడంతో ఇప్పుడు మరింత అనుమానాలకు దారితీస్తోంది.


విద్యార్థిని ఆత్మహత్య తర్వాత ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటుగా అందులో పని చేసే వారు కొంతమంది అదృశ్యమయ్యారని అధికారులు తెలుపుతున్నారు.. పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఈ విషయం పైన అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేకుండా పోయిందట. ముఖ్యంగా విద్యార్థి మరణం ప్రమాదమా లేక ఎవరైనా తోసారా అనే అనుమానాలు ఉన్నప్పటికీ ఈరోజు ఉదయం వైరల్ గా మారిన వీడియోని గమనిస్తే.. ఆ విద్యార్థి స్వయంగా బిల్డింగ్ పై అంతస్తు నుంచి కిందికి దూకినట్లుగా కనిపిస్తోంది.

12 ఏళ్ల విద్యార్థి మరణానికి కారణం పాఠశాల ఉపాధ్యాయుడు తీవ్రంగా మందలించారని దీంతో బాధపడి ఆమె ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా వినిపిస్తున్నాయి. కానీ విద్యార్థిని ఆత్మహత్య పైన స్కూల్ నుంచి ఎటువంటి అధికారికంగా ప్రకటన వెలువడ లేదు. ప్రస్తుతం స్కూల్లోని కొంతమంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జైపూర్ నగరంలోని ప్రసిద్ధ కాన్వెంట్ పాఠశాల నీరజ మోదీ స్కూలులో ఈ ఘటన జరిగింది. నవంబర్ 1 మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విద్యార్థి అమైరా ఆత్మహత్య చేసుకుందని విద్యార్థిని తలకు బలమైన గాయాలు కావడం చేత తీవ్రరక్తస్రావం అవ్వడంతో మరణించింది వైద్యులు తెలిపారు. ప్రిన్సిపల్ తో పాటుగా మరికొంతమంది అదృశ్యమయ్యారని వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయం పైన రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి కూడా స్పందిస్తూ.. ఆ బాలిక ఆత్మహత్య వెనుక ఎవరైనా దోషిగా తేలితే మాత్రం వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలియజేశారు. అలాగే ఆ స్కూల్ సంస్థ పైన కూడా ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: