ఈ ఆరోపణలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కొత్త కోణం లభించింది. జగ్గారెడ్డి చెప్పినట్టుగా, “బీఆర్‌ఎస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఓడించేందుకు ఈ కుట్ర పన్నుతోంది. హైడ్రా దాడులు కూడా అదే ప్లాన్‌లో భాగం,” అని అన్నారు. ఇటీవల కేటీఆర్ తరచుగా హైడ్రా గురించి మాట్లాడటం వెనుక పెద్ద రాజకీయ డ్రామా దాగి ఉందని ఆయన సూచించారు. హైడ్రా చీఫ్ రంగనాథ్‌ను ఉద్దేశిస్తూ జగ్గారెడ్డి చేసిన డిమాండ్ కూడా గమనార్హం. “కొంతమంది అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు. అంతేకాదు, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. హైడ్రా చర్యల వల్ల నష్టపోయిన బాధితులను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో మరోసారి రాజకీయ రగడ మొదలైంది. బీఆర్‌ఎస్‌పై నేరుగా ఆరోపణలు చేయడం, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారుల వ్యవహారం పై ప్రశ్నలు లేవనెత్తడం వల్ల పాలకపార్టీకి కూడా తలనొప్పి మొదలైంది. ఈ వివాదం జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. మొత్తానికి చూస్తే - “హైడ్రా” అనే పేరు ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ తుపానుకి మారింది. జగ్గారెడ్డి బాంబు పేలడంతో కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి బయటపడిందా? లేక నిజంగానే బీఆర్‌ఎస్ హస్తం ఉందా? అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. కానీ ఇప్పటికి మాత్రం - హైడ్రా వివాదంతో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ‘హీట్ ఆన్’ అయిందనడం తప్పుడు కాదు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి