కేకే తాజాగా తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాదులో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల సర్వే ఫలితాలు ప్రకటించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని కేకే ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 55% ఓట్లు వస్తాయని ఆయన తేల్చారు. కాంగ్రెస్ పార్టీకి 37% ఓట్లు వస్తాయని బిజెపికి గతంలో వచ్చిన 14 శాతం ఓట్ల లో సగం ఓట్లు ఏడు శాతం మాత్రమే వస్తాయని చెప్పారు. ఇది ఒక్కరోజులో చేసిన సర్వే తాను చాలా కాలం పాటు అన్ని డివిజన్లో చేసిన సర్వేగా ప్రకటించారు. అయితే కేకే సర్వే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో కలకలం రేపుతుంది. ఆయన ఇంట్లో కూర్చొని సర్వే చేశారని బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారని ఇది కేకే సర్వే కాదు కేటీఆర్ సర్వే అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. కేకే సర్వేలు కొన్ని రాష్ట్రాలలో విఫలం అయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఇచ్చిన సపోర్టు ముస్లింలు పట్టించుకోవడంలేదని కేకే సర్వే చెప్పింది.
పైగా డివిజన్ల వారిగా ఏ డివిజన్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి. ఏ డివిజన్లో ఏ పార్టీకి ఎంత ఆధిక్యత వస్తుంది తేల్చి చెప్పింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 50 % ఓట్లు సాధించడం అంటే అసాధారణమైన విషయంగా చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ లో కనిపిస్తున్న ప్లస్ పాయింట్లు ఏమిటంటే నవీన్ యాదవ్ బలం - మజిలీస్ సపోర్టు .. అధికార పార్టీ బలం అన్ని ఉన్నాయి. మరి వీటిని కాదని ఇక్కడ బిఆర్ఎస్ విజయం సాధించటం అంటే మామూలు విషయం కాదు. అదే జరిగితే కేకేకు మరోసారి తిరుగులేదని అర్థం అవుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి