జూబ్లీహిల్స్ బై పోలింగ్ ఎన్నికలను సైతం అన్ని పార్టీలు చాలా సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటుగా బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు కూడా తమ నేతను ఎలాగైనా గెలిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది సినీ సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను కూడా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోలింగ్ ఎన్నికలలో జనసేన పార్టీ ప్రచారం చేస్తుందనే విధంగా వినిపించాయి.ఏపీలో కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఉంది కనుక పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున ప్రచారం చేస్తారనే విధంగా వినిపిస్తున్నాయి.


అయితే బిజెపి పార్టీలో సీనియర్గా ఉన్న కిషన్ రెడ్డి, రామచంద్రరావు వంటి నేతలు అడిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ బై పోలింగ్లో టిడిపి కానీ జనసేన పోటీ చేస్తామని చెప్పలేదు. కానీ ముందు నుంచి బిజెపి పార్టీకి ప్రచార మద్దతు తెలుపుతారని విధంగా వినిపించాయి. దాని గురించి మాత్రం ఎవరు కూడా ఎక్కడ ప్రస్తావించినట్లు కనిపించడం లేదు. ఇప్పుడైతే తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి క్రిషన్ రెడ్డితో , జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ భేటీ అయిన తర్వాత బిజెపి పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు జనసేన పార్టీ.



జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఇది అత్యంత కీలకమైనటువంటి అంశము. బిజెపి, జనసేన పార్టీల నాయకులు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి , తదుపరి కార్యచరణకు సంబంధించి వివరాలను తెలియజేయబోతున్నామని,బిజెపి పార్టీ మద్దతు  నిర్ణయం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే బిజెపి అభ్యర్థి లంక దీపక్ రెడ్డికి తాము మద్దతు తెలిపామని, అందులో భాగంగా ప్రచారంలో పాల్గొంటామంటూ హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్. ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ప్రచారం సమయం ఉంది. ఇటువంటి తరుణంలో బిజెపికి జనసేన పార్టీ మద్దతు పలకడం ఇప్పుడు తెలంగాణ జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నిక మరింత హీటెక్కించేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: