చంద్రబాబు నాయుడు... రాజకీయ మనుగడ కోసం ఏమైనా చేస్తారు. ఎవరి మరణాన్ని అయినా రాజకీయం కోసం వాడుకుంటాడు. అంతటి గొప్ప వాడు చంద్రబాబు నాయుడు. అలానే అతను ఏ విషయం గురించి మాట్లాడాలంటే నోటి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతారు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దళితుల ముందే దళితుల్లా ఎవరైన పుట్టాలనుకుంటారా అని నోరు పారేసుకున్న బాబు.. చంద్రబాబు. 


ఎప్పటికప్పుడు.. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న అటుపక్క వ్యక్తిని మాటలతో మానసికంగా చంపేసి ఇటు రాజు అయ్యేవాడు చంద్రబాబు. ఎన్నికల ప్రచారం సమయం నుంచి మొదలు చంద్రబాబు వాడుతున్న భాష ప్రజలకు విసుగు పుట్టిస్తుంది. అయన మాట్లాడే మాటలు వింటే బయట ప్రజలు కూడా అలంటి భాషా మాట్లాడుకోరేమో అని అనిపిస్తుంది. 


వైఎస్ జగన్ ని ఉద్దేశిస్తూ ఎన్నో అనవసర మాటలు మాట్లాడాడు చంద్రబాబు. ఒకొక్కసారి వింటే ఛీ.. ఛీ చంద్రబాబు అని అనిపిస్తుంది. వైఎస్ జగన్ ని ఉద్దేశిస్తూ 'చెడ పుట్టాడు..' అంటూ ఎన్నికల ప్రచారంలో అని అలంటి చెత్త ముద్రలు అన్ని వెయ్యాలి అనుకున్నాడు. రాజకీయంగా అతన్ని ఎక్కడ తొక్కేస్తాడో.. ఎక్కడ ప్రజలు అతన్ని దేవుడు అనుకుంటాడో అని ఇలాంటి మాటలు మాట్లాడాడు. 


బాబు అంటే వయసుమళ్లింది.. మతిపోయింది అని అనుకుంటే .. ఇతనికి తోడు ఇతడు సుపుత్రుడు నారా లోకేష్ కూడా జగన్ ని ఘోరంగా తిడుతున్నాడు.. ఒకసారి నీ బాబు అని తిడుతూ ట్విట్ చేస్తే మరొకసారి సిగ్గు అంటూ సిగ్గు గురించి మాట్లాడుతూ సిగ్గు పరువు తీస్తున్నాడు నారా లోకేష్. ఏది ఏమైనా ఇద్దరు ఒకే విధంగా నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. మరి వీరి మాటకు ఎప్పుడు తాళం పడుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: