సంపద అంటే అందరికీ ఇష్టమే.... ఐశ్వర్యం ఉన్నప్పుడే ఆర్థిక సమస్యలు లేకుండా జీవితం సాఫీగా గడపగలరు... అలాంటప్పుడు ఐశ్వర్యాన్ని ఇష్టపడని మనిషి ఉండరు. సంపదను సమకూర్చే శ్రీ మహాలక్ష్మి దేవి అంటే అందరికీ మక్కువే. అందులోనూ ఆమె ఆగ్రహం పొందడానికి ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.. కొందరు ఇవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టిపారేసిన... మరికొందరు ఇదంతా శాస్త్రం... అవన్నీ శాస్త్రం చెప్పే సత్యాలు అంటూ వాటిని ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు.. అనగా అప్పుల్లో , నష్టాల్లో ఉండేవారు, చేతిలో సంపద నిలవని... వంటి సమస్యలతో బాధపడేవారు మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి ఈ క్రింది విధంగా చేయాల్సి ఉంటుంది.

శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని  ఐశ్వర్య దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఈ దీపాన్ని శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు ఒకసారి అలాగే సూర్యోదయం తర్వాత మరొక సారి వెలిగించి లక్ష్మీదేవిని పూజించడం వలన ఐశ్వర్యాలు సిద్ధించి సకల సంతోషాలు కలుగుతాయి. ఈ దీపం వెలిగించడానికి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో రెండు వెడల్పాటి  ప్రమిదలు ఉంచాలి. అక్షింతలు, కలకండ, చిన్న బెల్లం ముక్క, అరటి పళ్ళు, తాంబూలం, పువ్వులు సిద్ధం చేసుకోవాలి.

ఇంట్లోని వారందరూ  తలస్నానాలు ముగించి శుభ్రంగా ఉండాలి. పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ని కానీ లేదా ప్రతిమ ను  కానీ శుభ్రపరిచి అలంకరించి ఉంచాలి. శ్రీ లక్ష్మీ మాత ఫోటో ముందు బియ్యప్పిండితో ముగ్గు వేయాలి. ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పు నింపుకొని ఆ ప్రమిద పై అక్షింతలు ఉంచి దానిపై నూనెతో దీపం వెలిగించాలి. ప్రమిదలు చుట్టూ పూలతో అలంకరించాలి. లక్ష్మీదేవికి బెల్లం తో చేసిన నైవేద్యం  సమర్పించాలి. ఆ తర్వాత శనివారం ఆదివారం రోజు కూడా దీపాన్ని వెలిగించి తర్వాత పూజకు ఉపయోగించిన ఉప్పును రవీంద్ర నీటిలో వదిలేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటుంది. అష్ట ఐశ్వర్యాలతో కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: