అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న స్టార్ క్రికెటర్లలో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజాం కూడా ఒకడిగా కొనసాగుతున్నాడు.  ఇక ఇప్పటి వరకు ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేసి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అత్యుత్తమ క్రికెటర్ గా పేరుగాంచాడు. కానీ గత కొంత కాలం నుండి మాత్రం అతని ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి కాలంలో ఆశించిన  స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్న నేపథ్యంలో ఓపెనర్ గా వస్తున్న బాబర్ అజాం తక్కువ పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇక ఇటీవల ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్ జట్టు ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ వరకు వెళ్ళింది. అయితే ఇందులో కెప్టెన్ బాబర్  పాత్ర మాత్రం ఏమీ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అతను బ్యాటింగ్ లో బాగా రాణించాల్సింది పోయి ఘోర ప్రదర్శన చేశాడు. ఇక ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు అంటే అతడు ఎంత ఘోరమైన ఫామ్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే సాధారణంగా ఫాంలో ఉన్నప్పుడు బాబర్ అజాం అతని టెక్నికల్ షాట్లతో అందరిని ఆకట్టుకుంటూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే బాబర్  కవర్ డ్రైవ్ గురించి 9వ తరగతి ఫిజిక్స్ సిలబస్ లో ఒక ప్రశ్న తయారు చేశారు.


 ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. బాబర్ తన బ్యాట్ ద్వారా బంతికి 150 జోల్స్ తో క్రెనేటిక్ ఎనర్జీ అందించడం ద్వారా కవర్ డ్రైవ్ కొట్టాడు. (ఏ) బంతి ద్రవ్యరాశి 120 గ్రాములు అయితే బంతి ఏ వేగంతో బౌండరీకి వెళుతుంది. (బి ) 450 గ్రాముల ద్రవ్యరాశి కలిగిన ఫుట్బాల్ ఈ వేగంతో తరలించడానికి క్రీడాకారుడు ఎంత ఎనర్జీ అందించాలి అని ఉంది.  అయితే దీని పై అభిమానులు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. అతను ఫామ్ లోనే లేడు. కానీ పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కాడు అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: