కరోనా గిరోనా నా ? అసలు ఏదైనా నా దరిదాపుల్లోకి రాలేదమ్మా..! నేనంటే అంత భయం మరి. ప్రపంచమంతా గడగడలాడించిన నా దగ్గర పప్పులు ఏమీ ఉడకవు. అంటూ పై మాటకు చెప్పి,  ఎక్కువగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ, అప్పుడప్పుడు జనాల మధ్యకు వచ్చి ఆవేశం ప్రదర్శిస్తూ వచ్చిన మన చిన బాబు గారు ఇప్పుడు చిరంజీవికి కరోనా సోకింది అని తెలియగానే ఎక్కడలేని కంగారు పడిపోతున్నారు. ఉన్నపళంగా తన మీటింగ్ లు అన్నీ క్యాన్సిల్ చేయమని సెగట్రీ కి  ఆజ్ఞలు జారీ చేసి పడేశాడు. అసలు ఉన్నపళంగా బాబు గారు ఇంత సాహసమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలియక తెగ హైరానా పడి పోతున్నారట తెలుగుదేశం జనాలు. 


అసలు ఇప్పటి వరకు ఎంతో మందికి కరోనా సోకినా, కంగారుపడ ని బాబోరు చిరంజీవికి అది షోకే టప్పటికి తెగ కంగారు పడిపోతున్నాడట. అసలు ఏడు పదుల వయసు దాటిన ఈ సమయం వచ్చిన కోలుకోవడం కష్టమని, అందుకే కృష్ణ రామా అనుకుంటూ ఉండడమే బెటర్ అనే అభిప్రాయంతో ఇప్పుడు ఎవరిని తన దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవడంతో పాటు , ఇంటిలోనే విశ్రాంతి తీసుకోవాలని, జనాల్లోకి రాకూడదని, ఏదన్న తన పుత్రరత్నం చూసుకుంటాడని, బాబోరు కాస్త బలంగా ఫిక్స్ అయిపోయాడట. అసలు ఎప్పటి నుంచో బాబుకి కరోనా భయం ఉంది. అందుకే ఏపీకి వచ్చినా, ఎన్నో ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ మధ్య ఓ సందర్భంలో అమరావతికి వచ్చినప్పుడు బాబు తీసుకున్న జాగ్రత్తలపై ఏపీ మంత్రి కొడాలి నాని వంటివారు సెటైర్లు వేశారు. చంద్రమండలం నుంచి వచ్చిన వాడిలా కోటు, మాస్కులు వేసుకున్నాడు అంటూ హేళన చేసినా, బాబు ఏ మాత్రం వాటిని పట్టించుకోలేదు. 



ఓవైపు పార్టీ కోసం త్యాగం చేస్తూనే , ఏపీలో అడుగు పెట్టి భయం భయం గా గడిపేవారు. అసలు దేనికీ భయపడను అని చెప్పుకునే బాబు కరోనా విషయంలో మాత్రం చాలా భయపడుతున్నట్టుగా  కనిపిస్తున్నారు. అందుకే ఇకపై ఎవరికీ ప్రత్యక్షంగా అందుబాటులో ఉండకుండా , ఇంటికే పరిమితం అవ్వాలని డిసైడ్ అవ్వడం తెలుగు తమ్ముళ్లకు మరింత బాధను కలిగిస్తోందట. మొత్తం ఈ క్లిష్ట సమయంలో లోకేష్ బాబు మీదే భారం అంతా వేశారని , ఆయన ఏ విధంగా నడి సంద్రంలో ఉన్న పార్టీ  నావను ఒడ్డుకు చేరుస్తారో అంటూ నిట్టూర్పులు నురుస్తున్నరట.

మరింత సమాచారం తెలుసుకోండి: