మానసిక స్ధితి సరిగా ఉన్నవాళ్ళు ఎవరూ మాజీమంత్రి, తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లాగ మాట్లాడరు. తిరుపతిలో మీడియాతో అచ్చెన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిది ఏమతమో ? జగన్ ఏ దేవుడిని కొలుస్తాడో బహిరంగంగా చెప్పాలంటూ చాలెంజ్ విసిరారు. జగన్ ది ఏ మతమో ? ఏ దేవుడిని కొలుస్తాడో ? అచ్చెన్నకు ఏమి అవసరం. అచ్చెన్నది ఏ మతమో ? ఏ దేవుడిని కొలుస్తారో ? ఎప్పుడైనా, ఎవరైనా అడిగారా ? జగన్ మత రాజకీయాలు చేస్తున్నాడని నానా గోలచేస్తున్న ఇదే అచ్చెన్న మళ్ళీ జగన్ మతాన్ని, దేవుడిని ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇక్కడ మతపరమైన రాజకీయాలు చేస్తున్నది ఎవరో జనాలకు అర్ధమైపోతోంది.




అయినా జగన్ మతం ఏమిటో ? ఏ దేవుడిని కొలుస్తాడో తెలీకుండానే జనాలు 151 సీట్లలో వైసీపీని గెలిపించారా ? ఇంతమాత్రం అచ్చెన్నకు ఇంగితం లేదా ? అన్నీ తెలిసే అచ్చెన్న జగన్ మతప్రస్తావన తేవటంలో అర్ధమేంటి ? ఏమిటంటే ఒకవేళ జగన్ గనుక క్రిస్తియన్ అని చబితే వెంటనే దాన్ని పట్టుకుని నానా రబస చేయటానికి రెడీగా ఉన్నారు. చూశారా తాను క్రిస్తియన్ అని జగనే స్వయంగా చెప్పుకున్నాడు..అందుకనే హిందు దేవాలయాలపై జగన్ దాడులు చేయిస్తున్నాడని మరింత బురద చల్లటానికి అచ్చెన్న ప్లాన్ వేసుకున్నారు. ప్రశ్నించేదీ వీళ్ళే. ఆ ప్రశ్నకు ఒకవేళ సమాధానం చెబితే ఆ సమాధానాన్ని పట్టుకుని నానా యాగీ చేద్దామని ప్లాన్ చేస్తున్నదీ వీళ్ళే. వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టే జగన్ అసలు వీళ్ళని పట్టించుకోవటమే లేదు.




 చంద్రబాబునాయుడు, నారా లోకేష్, అచ్చెన్న లాంటి వాళ్ళు మతపరమైన రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. తమ రాజకీయాలతో జగన్ను ఇబ్బంది పెట్టాలని తెగ ప్రయత్నిస్తున్నారు. అందుకనే మాటకు ముందోసారి వెనకోసారి జగన్ మతపరమైన రాజకీయాలు చేస్తున్నారంటూ నానా గోల చేసేస్తున్నారు. మతపరమైన రాజకీయాలు వీళ్ళు చేస్తు ఆ నేపాన్ని జగన్ మీదకు తోసేస్తుండటమే విచిత్రంగా ఉంది. పాలనా పరమైన వ్యవహారాల్లో జగన్ను ఢీ కొనటం సాధ్యంకాదని వీళ్ళకు అర్ధమైపోయినట్లుంది. అందుకనే గతంలో ఎప్పుడు లేనట్లుగా మతపరమైన రాజకీయాలను తలకెత్తుకున్నారు. ఎంతైనా కొత్త రాజకీయం కదా అందుకనే ఏమి మాట్లాడాలో అర్ధంకాకుండా నోటికేదొస్తే అదల్లా మాట్లాడేస్తున్నారు. అందుకనే వీళ్ళకు ఏదో అయిపోయిందనే అనుమానలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: