మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించడం అనే ఆచారం ఎప్పటినుండో ఉంది. మరియు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారినప్పుడు కూడా పాలు పొంగిస్తారు. అలా పాలు పొంగిస్తే ఆ ఇంట్లోని వారు సుఖ సంతోషాలతో ఉంటారని అంటుంటారు. సంపదలకు లక్ష్మీదేవి అధిపతి. లక్ష్మీదేవి సముద్రగర్భం నుంచి పుట్టింది. లక్ష్మీపతి శ్రీహరి పాలసముద్రంలో పవళిస్తారు. అందువల్ల ఇంట్లో పాలు పొంగించడం వల్ల  అష్టైశ్వర్యాలు, భాగ్యాలు ప్రశాంతత, సంతానం, ధనం, అభివృద్ధి కలుగుతాయనేది అందరి విశ్వాసం. కొత్త ఇల్లు కొన్నా లేదా కట్టుకున్నా అందులోకి వెళ్లేటప్పుడు ఎన్నో ఆచారాలను పాటిస్తుంటారు.

అందులో ముఖ్యంగా చేసేది మాత్రం పాలు పొంగించడం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. పాలు పొంగించడం అనేది సంప్రదాయం అని చెప్తారేకానీ దాని వల్ల కలిగేటటువంటి ఉపయోగం ఏమిటో చాలా మందికి తెలియదు.పాలు పొంగించే ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయనేది నమ్మకం. సంపదకు సంకేతం లక్ష్మీదేవి. ఆమె హృదయస్వరుడు పాలసాగరాన పవళించిన శ్రీహరి. అందువల్ల పాలు పొంగించడం వల్ల భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. కొత్తగా ఇంట్లో కి వెళ్ళే ముందు ఆవును ఇంట్లోకి ప్రవేశపెడతారు. తర్వాత ఆ ఇంటి యజమాని వెళ్తారు. గోవు కామదేనువు. ఆవు తిరిగిన ఇంట్లో ఎటువంటి దోషాలు ఉండవని అందరి నమ్మకం. ఇంటి ఆడపడుచులను పిలిచి వారి చేత పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో అన్నం వండి వాస్తు పురుషునికి సమర్పిస్తారు. పాలు పొంగించినటువంటి ఇంట్లో సంపదకు, సుఖశాంతులకు కొదవుండదు. ఇంటి ఆడపడుచులకు ప్రాముఖ్యత ఇచ్చిన వారి ఇళ్లలో సఖ్యత నెలకొంటుంది.సమైక్య జీవనానికి ఇది నాంది పలుకుతుంది. ఇలాంటి సంప్రదాయం భారతదేశంలో మాత్రమే నెలకొని ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కొత్త ఇల్లు నిర్మించుకున్న వారు అందులో కి వెళ్లేముందు ఈ సంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: