ప్రతి ఇంట్లోను గురువారం వచ్చిందంటే చాలు.. శ్రీ షిరిడి సాయిబాబా నామ స్మరణలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. బాబాకి సంబంధించిన పాటలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. గురు  వారం వచ్చిందంటే చాలు అంత సాయిబాబా చెంత దర్శనం ఇస్తూ ఉంటారు . గురువారం సాయిబాబాని స్మరించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి అని ఎప్పటినుంచో భక్తులు నమ్ముతున్న విషయం. అది అందరికీ తెలుసు . అలా కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే బాబా ను ఇలా ప్రసన్నం చేసుకోండి అంటున్నారు పండితులు . చాలామంది బాబాను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు .

గురువారం అనేది సాయిబాబాకు ఎంతో ప్రీతి కరమైన రోజు.  కాబట్టి ఆ గురువారం నాడు ఆయనకు ఇష్టమైన విధంగా పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని నమ్ముతూ ఉంటారు . ధూప దీపాలతో పాల తో నైవేద్యం పెట్టి సాయిబాబాను పూజిస్తూ ఉంటారు . గురువారం నాడు సాయిబాబా కి ఈ విధంగా పూజ చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అని ఆయన భక్తుల కోరిన కోరికలు తీరుస్తారని పండితులు చెప్పుతూ ఉంటారు.  హిందూ ధర్మంలో ప్రతిరోజు ఒక్కో దేవుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. గురువారం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూడా షిరిడి సాయిబాబా ను ఎక్కువగా పూజిస్తూ ఉంటారు జనాలు.  ఆయన ఆశీస్సులు పొందేందుకు గురువారం నాడు ఉపవాస దీక్ష కూడా చేస్తూ ఉంటారు.  కాగా  గురువారం సాయి బాబా కు పాలాభిషేకం చేస్తే ఆయనకు ఎంతో ఇష్టం.  అంతేకాదు సాయిబాబా ఎప్పుడు " సబ్కా మాలిక్ ఏక్ హె" అనే సందేశాన్ని ఇచ్చేవారు.  విశ్వాసాల ప్రకారం సాయిబాబా తనని పూర్తి విశ్వాసంతో పూజిస్తే భక్తులకు ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటాడు.  కష్టాలు తొలగిస్తాడు అని నమ్ముతూ ఉంటారు జనాలు .

గురువారం సాయిబాబా కి పూజ చేసే విధానం:

*గురువారం నాడ్య్ తెల్ల‌వారుజామునే అంటే  బ్ర‌హ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి.

*అనంత‌రం చాలా నిష్టగా అభ్యంగ స్నానం చేయాలి..

*పూజ గ‌దిని శుభ్ర పరుచుకోవాలి

*షిర్డీ సాయిబాబాకు ఎంతో ఇష్ట‌మైన ప‌సుపు రంగు వ‌స్త్రాలు ధ‌రిస్తే ఇంకా ఇంకా మంచిది.

*సాయిబాబా విగ్ర‌హాన్ని శుద్ధ‌మైన జ‌లంతో లేదా పంచామృతంతో(పాలు, పెరుగు, తేనే, పంచదార‌, నెయ్యి) అభిషేకం చేయాలి.

*బాబాను ప‌సుపు రంగు వ‌స్త్రం, పువ్వులతో అలకరించించి..ఆ త్రువాత ధూపం వేసి.. గడ్డ కర్పూరం తో హారతి ఇవ్వండి.

*ఆ స‌మ‌యంలో షిర్డీ సాయిబాబా శ్లోకాల‌ను జపిస్తే మంచిది.

*అనంత‌రం గ‌త త‌ప్పుల‌కు క్ష‌మాప‌ణ కోరుతూ.. శాంతి, సంతోషం కోసం నిజ‌మైన భ‌క్తితో పూజ‌లో నిమ‌గ్నమై పోండి.

*నైవేద్యంగా ల‌డ్డూలు, పాలకోవా పెట్టండి.

*సాయంత్రం మరోసారి సాయిబాబాకి ప్రత్యేకంగా పూజ చేసి ఉపవాసం ముగించండి.

*గురువారం నాడు ఎవ్వరైన సరే  మీకు ఎంత తోచితే అంత ..మీకు ఉన్నదాంట్లో ఎంత వీలైతే అంత దానం చేయండి.

*గురువారాల్లో ఈ ఆచారాలను పాటించడం వల్ల ...ఆ సాయిబాబా  ఆశీసులు పొంతారు. ఆయనను త్వరగా ప్రసన్నం చేసుకుంటారని, జీవిత కష్టాలు తొలగిపోతాయని భ‌క్తులు నమ్ముతారు. చాలా మంది పండితులు ఇదే చెబ్బుతున్నారు.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఒక్కోక్కరు ఒక్కో విధంగా పూజిస్తారు. మీరు ఏదైన పాటించే ముందు మీకు తెలిసిన పండితుల సూచనలు సలహాలు తీసుకోవడం ఉత్తమం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: