ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఒక సందర్భంలో తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే, చాలా మంది దేవతలు ఉన్నప్పటికీ, హిందువులు విగ్నేశ్వరుడిని మాత్రమే నీలల్లొ నిమజ్జనం చేసి ప్రత్యేకంగా పూజిస్తారు. వినాయక చవితి పండుగ రోజు ఆయనను అత్యంత ఇష్టంగా అలంకరించుకుని, ధూపం, దీపం, నైవేద్యాలతో పూజిస్తారు. ఆ చివరలో ఆయనను నిమజ్జనం చేయడం ఎందుకు జరిగిందో అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. దీని గురించి మన శాస్తాలలు..మన పెద్దలు రకరకాలుగా చెప్పుతూ ఉంటారు.


వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. ప్రకృతి పచ్చదనంతో నిండి, వర్షపు జల్లులతో భూమి ప్రాణశక్తిని పుంజుకుంటున్నప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. ఈ భాద్రపద మాసంలో నదులు నీటితో నిండినవి, ప్రతి ప్రదేశం సజీవంగా కనిపిస్తుంది. గణపతికి ఆకుపచ్చ రంగు ఎంతో ఇష్టం కాబట్టి, ఆయనకు గడ్డి జాతి మొక్కలను సమర్పించడం చాలా ప్రీతికరమైన పద్ధతిగా ఉంటుంది. అందుకే, పూజలో 21 గడ్డి జాతి మొక్కలను సమర్పిస్తారు. వినాయక చవితి నాడు, గణేశుడు భక్తుల పూజలు స్వీకరించి, వారి కోరికలు తీర్చడానికి భూమిపైకి వచ్చే మార్గం సముద్రం ద్వారా అని పురాణాలు చెబుతున్నాయి.

 

అందువల్ల, వినాయకుడి విగ్రహాలను చివరలో నీటిలో నిమజ్జనం చేయడం శాస్త్రీయంగా మంచిదని పండితులు సూచిస్తున్నారు. పండితుల ప్రకారం, తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న తర్వాత, పదవ రోజు విగ్రహాన్ని జల నిమజ్జనం చేస్తే భక్తులకు పూర్తి సంతృప్తి కలుగుతుంది. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం నుంచి ఉత్పన్నమైన ప్రతి సజీవ, నిర్జీవ పదార్థాలు చివరికి భూమిలో కలిసిపోతాయి. అంతేకాక, మనం ఎంత గొప్పగా జీవించినా, చివరికి భూమితోనే కలవడం జరుగుతుంది. ఈ తత్త్వాన్ని గుర్తు చేయడానికి, ప్రకృతి దేవుడైన మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు చేసి, హడావిడి చేస్తూ, నృత్యాలతో ఊరేగించి, చివరలో నీటిలో నిమజ్జనం చేస్తారు. ఫైనల్లీ మన పెద్దలు చెప్పొచ్చేది ఏంటంటే..ఎంత గొప్పగా బతికినా, చివరికి మనం భూమితోనే కలిసిపోతాం. అది మనం గుర్తు పెట్టుకోవాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: