దీపావళి పండగ రోజు ఇంటి ముందు దీపాలు, బాంబుల మోతతో రాష్ట్రం మొత్తం మార్మోగిపోతూ ఉంటుంది. ఈ దీపావళి పండుగని చాలామంది చిన్నపిల్లలు ఇష్టపడి చేసుకుంటారు. ముఖ్యంగా ఈ పండగ రోజు బాంబులు పేల్చడం, క్రాకర్స్ కాల్చడం, లక్ష్మీ పూజ చేయడం ఇలా ఎన్నో ఉంటాయి. అయితే దీపావళి పండుగ రోజు ఈ పనులు చేస్తే మాత్రం ఏడాదంతా ఇంట్లో దరిద్రమే అంటున్నారు జ్యోతిష్యులు.. మరి ఇంతకీ దీపావళి రోజు చేయకూడని ఆ పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.. చాలామంది దీపావళి ముందు రోజే బూజు దులపడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం వంటివి చేస్తారు. అయితే ఎప్పుడైనా సరే దీపావళి ముందే ఈ పని చేయాలట. దీపావళి రోజు పొరపాటున కూడా ఇంట్లో బూజు దులపడం వంటివి చేయకూడదట.

 అంతేకాకుండా దీపావళి రోజు మాంసం, మద్యం ముట్టుకోకూడదు. దీపావళి రోజు ఇంట్లో మాంసం వండితే ఆ లక్ష్మీ దేవికి కోపం వస్తుందట. అలాగే దీపావళి రోజు పొరపాటున కూడా ఇంటిని చీకటి గా ఉంచకూడదు. ఇల్లు మొత్తం దీపాలతో వెలిగి పోతూ ఉంచాలి.ఇలా దీపావళి రోజు ఇంటి ముందుగానీ, ఇంట్లోగానీ చీకటిగా ఉంచితే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే దీపావళి రోజు తులసి ఆకులను తెంపడం గానీ, తులసి చెట్టుని పీకడం గానీ చేయకూడదట.

అలా చేస్తే సంవత్సరం అంతా పేదరికం వెంటాడుతుందట. అంతేకాకుండా దీపావళి పండగ రోజు వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవడం,వేరే వాళ్లకు అప్పు ఇవ్వడం చేయకూడదని జ్యోతిష్యులు అంటున్నారు. ఇలా చేస్తే గనుక మరింత పేదరికంలో మునిగిపోతారట. ఇక దీపావళి రోజు ఇల్లు పరిశుభ్రంగా ఉంచటమే కాదు మనసులు కూడా ప్రశాంతంగా ఉండాలని,ఇంట్లో గొడవలు వంటివి పడకూడదని ఇలా ఉంటేనే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: