సౌత్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న హీరోయిన్ రెజీనా పాత్ర నచ్చితే విలన్ గా కూడా నటించడానికి వేనుకాడదు. ఇటీవలే రెజినా వ్యక్తిగత జీవితంలో కూడా మతమార్పిడి గురించి ఎవరికీ తెలియని విషయాన్ని తెలియజేసింది. రెజినా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. అయితే తనకు 9 ఏళ్ల వయసులోనే టీవీ చానల్స్ లో అవకాశం రావడంతో యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టింది. తన క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రెజీనా చిన్నతనంలోనే కళా రంగం పైన మరింత ఆసక్తిని పెంచుకుంది.



అలా 14 ఏళ్ల వయసులో నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన సినిమా కందనాన్ మూ అనే సినిమాలో చెల్లెలి పాత్రలో నటించింది. 2012లో తెలుగులో వచ్చిన ఎస్ఎంఎస్ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన తొలి సినిమాకే సైమా నుంచి నటిగా అవార్డు అందుకుంది. అలా తెలుగు ,తమిళ్, హిందీ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించిన రెజినా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పవర్, కొత్తజంట, ఎవరు, చక్ర, కేసరి చాప్టర్ 2 తదితర చిత్రాలలో కూడా నటించింది.


ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా తన మతం మార్పు విషయం పైన అసలు విషయాన్ని బయటపెట్టింది... తన తండ్రి ముస్లిమని ,తల్లి క్రిస్టియన్ అని ఇద్దరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు చిన్నతనంలోనే తాను ముస్లింగా పెరిగాను, ఆరు ఏళ్ల తర్వాత తాను క్రిస్టియన్ లోకి మారిపోయానని తెలిపింది.. అయితే అలా మారడం వెనుక మాత్రం కథను చెప్పలేదు రెజీనా. రెజీనా చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఏటువంటి విషయాన్నినైనా సరే మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది. రెజీనా ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్ సినిమాతో పాటు మరో రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: