
అల్లం లో ఉండే జింజెరాల్స్ వల్ల నోటిలో ఉండే హానికరమైన బాక్టీరియాను చంపేస్తుంది. ముఖ్యంగా చిగుళ్ల ఇన్ఫెక్షన్ తగ్గించి నోటి దుర్వాసనను తగ్గిపోయేలా చేస్తుంది. దీని ద్వారా శ్వాస కూడా సులభంగా ఆడుతుంది.
వ్యాయామం చేసిన తర్వాత కండరాల నొప్పితో ఇబ్బంది పడేవారు అల్లం టీని తాగడం వల్ల శరీరంలో మంట తగ్గేలా చేస్తుంది. దీని ఫలితంగా కండరాల నొప్పి అలసట వంటివి దూరం చేస్తుంది.
పచ్చి అల్లం తినడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా అజీర్ణం ,గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.
అల్లం లో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు ఫంగస్, బ్యాక్టీరియా వంటి వాటితో పోరాడే శక్తిని కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లవర్మెంటరీ లక్షణాలు వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా జలుబు, ఫ్లూ వంటి సమస్యలను తగ్గించేస్తుంది.
మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనం పొందాలి అంటే అల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే పచ్చి అల్లం నమలడం లేదా అల్లం టీ తాగడం వల్ల ఈ నొప్పి సహజంగా ఉపశమనాన్ని కలిగిస్తుందట. ప్రతిరోజు ఆహారంలో అల్లాన్ని చేర్చుకుంటే ఈ అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.