యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ప్రజెంట్ కేర్ రాంప్ పేరుతో కిరణ్ అబ్బవరం ఒక కొత్త సినిమాను చేయడం జరిగింది . ఇక ఈ మూవీ దీపావళి కానుకగా ఈ శనివారం అనగా అక్టోబర్ 18న థియేటర్లలోకి రానుంది . దీంతో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ హీరో . ఒక్కడే అన్ని ఊర్లు తిరుగుతూ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నారు . తాజాగా ఓ మీడియా మీట్ సందర్భంగా పలువురు అభిమానులతో మరియు మూవీ లవర్స్ తో ముచ్చటించాడు కిరణ్ .


ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రశ్న రాగా కిరణ్ నుంచి వద్దు అనే సమాధానం వినిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఓ జి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అని ఓ వ్యక్తి కిరణ్ అబ్బవరం ని అడగడం జరిగింది . దీనికి కిరణ్ నుంచి .. ఇప్పుడు వద్దు బ్రో అనే సమాధానం వచ్చింది . అయితే ఎందుకు నో చెబుతున్నాననే దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు .  " ప్రెసెంట్ నా సినిమా కె ర్యాంప్ రిలీజ్ ఉంది .


ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబితే దానికోసం ఎక్కువ వాడుకుంటారేమో . ఇప్పుడు ఎక్కువ చెబితే టికెట్స్ తగ్గుతాయేమో అనే ఫీలింగ్ వస్తుంది . నాకు అది వద్దు. మరీ అన్నిసార్లు అభిమానం గురించి పదేపదే చెప్పడం కరెక్ట్ కాదు " అంటూ కిరణ్ కామెంట్స్ చేశాడు . ప్రజెంట్ కిరణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇక కిరణ్ అబ్బవరం నటించిన ఈ యాక్షన్ మూవీ ప్రేక్షకులలో ఎంత మేరా అభిమానం సంపాదించుకుంటుందో వేచి చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: