ఓ వైపు టీమిండియా జట్టు అదరగొడుతూ  వరుస సిరీస్ లను  సొంతం చేసుకుంటే మరోవైపు టీం ఇండియా అండర్ 19 ఆటగాళ్లు కూడా తన సత్తా చాటుతూ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా అండర్-19 జట్టు వరల్డ్ కప్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రత్యర్థి జట్టులు  అన్నింటిని చిత్తు చేస్తూ సెమీఫైనల్కు చేరుకుంది అండర్-19 జట్టు. ప్రతి మ్యాచ్లో కుర్రాళ్లు ప్రత్యర్థి జుట్టు లన్నింటిని చిత్తు చేస్తూ వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక సెమీఫైనల్స్లో భారత్ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో మ్యాచ్  ఆడింది. కాగా మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్... 172 పరుగులను అతికష్టంగా చేసింది.భారత  బౌలర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాట్ మెన్స్  తట్టుకోలేకపోయారు. దీంతో 172 పరుగుల  లక్ష్యాన్ని  టీమిండియా ముందుంచారు. 

 

 

 కాగా ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా జూనియర్లు విశ్వరూపం చూపించారు అనడంలో సందేహం లేదు. అంతకు ముందు తమ బౌలింగ్ ప్రదర్శనతో  పాకిస్తాన్ బ్యాట్మెన్స్ ను  ఇబ్బందులకు గురిచేస్తూ కేవలం 12 పరుగులకే కట్టడి చేసి ఆలవుట్  చేస్తే... భారత ఓపెనర్లు మాత్రం ఒక వికెట్ కూడా కోల్పోకుండా విధ్వంసకరమైన ఆటను ప్రదర్శించారు. 35.2 ఓవర్లోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 176 పరుగులు చేశారు ఓపెనర్లు. పది వికెట్ల తేడాతో విజయభేరి మోగించారూ . అండర్ 19 జట్టులో  సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్  యశస్వి  జైస్వాల్  అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అనే చెప్పాలి. 8 ఫోర్లు 4 సిక్సర్లతో విజృంభించి 105 పరుగులు చేసి అజేయంగా నిలువగా... మరో ఓపెన్ దివ్యాన్ష సక్సేనా 59 పరుగులతో అద్భుతమైన తోడ్పాటు అందించారు.

 

 

 అయితే ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు పాకిస్తాన్ జట్టు ఆరుగురు బౌలర్లతో ప్రయోగాలు చేసినప్పటికీ కూడా.. భారత ఓపెనర్లు మరింత చెలరేగి ఆడారు. అయితే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ సీనియర్ జట్టు కూడా ఇంత సాధికారంగా ఆడలేదు అని అందరికీ అనిపించేలా కుర్రాళ్ళు కుమ్మేశారు. ఈ విజయంతో సెమీఫైనల్ నుంచి భారత్ ఫైనల్కు చేరుకుంది. ఎల్లుండి  న్యూజిలాండ్ బంగ్లాదేశ్ల మధ్య జరిగే సెమీఫైనల్లో గెలిచినా జట్టు  తో భారత కుర్రాళ్లు టైటిల్ కోసం తలపడనున్నారు. ఇక అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 9న  ఆదివారం నాడు జరుగుతుంది. ప్రస్తుత భారత విజయం టీమిండియా ఆటగాళ్లు లో మరింత ఉత్సాహాన్ని పట్టుదలను నింపుతుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: