కొన్ని రోజుల నుంచి టీమిండియాలో చోటు కోసం కుల్దీప్ యాదవ్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అటు కుల్దీప్ యాదవ్ జట్టులోకి ఎంపికపై కూడా భారత క్రికెట్లో ఎంతగానో చర్చ జరిగింది. ఎప్పటినుంచో భారత క్రికెట్కు దూరమైన కుల్దీప్ యాదవ్ ఇక ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో జట్టులో స్థానం సంపాదించాడు. ఛాన్స్ వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రతి ఆటగాడు. కానీ కుల్దీప్ యాదవ్ మాత్రం వచ్చిన అవకాశాన్ని చెత్తగా ఉపయోగించుకున్నాడు.



 ఇటీవలే ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భాగంగా.. టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి ఇక అద్భుతమైన ప్రదర్శన చేసి 336 పరుగులను చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు దాదాపుగా రెండవ వన్డే మ్యాచ్లో గెలవడం అసాధ్యం అని అనుకున్నారు అందరు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ అద్భుత ప్రదర్శన చేశారు అని చెప్పాలి. ఎన్ని విధాలుగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ..  ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ మాత్రం ఎంతో అద్భుతంగా రాణించారు.



 నిన్న కుల్దీప్ యాదవ్ బౌలింగ్ తో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అతని స్పిన్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ అందరూ కూడా ఒక ఆట ఆడుకున్నారు అని చెప్పాలి. ఇక రెండో వన్డే మ్యాచ్లో భాగంగా కుల్దీప్ యాదవ్ ఒక చెత్త రికార్డ్ నమోదు చేశాడు.  అతని బౌలింగ్ లో ఇంగ్లీష్ బ్యాట్ మెంట్స్ సిక్సర్ల వర్షం కురిపించారు. ఏకంగా ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎనిమిది సిక్సర్లు బాదారూ. దీంతో కుల్దీప్ యాదవ్ ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు వన్డేల్లో భారత్ తరఫున అతి ఎక్కువ సిక్సర్లు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే గతంలో వినయ్ కుమార్ పేరిట  (7 సిక్సర్లు)  చెత్త రికార్డు ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: