మొన్నటి వరకు జరిగిన ఐపీఎల్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున అద్భుతంగా రాణించి పరుగుల వరద పారించాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఇక శిఖర్ ధావన్ కు జోడిగా యువ ఆటగాడు పృద్వి షా మంచి సహకారం అందించాడు. అతను కూడా మంచి స్కోరు చేశాడు. అయితే ఇక అటు ఐపీఎల్లో ఢిల్లీ కాపిటల్స్ జట్టులో కొనసాగిన ఓపెనింగ్ జోడి ఇక ఇప్పుడు శ్రీలంక జట్టుతో తలపడుతున్నా మొదటి వన్డే మ్యాచ్లో కూడా రిపీట్ కాబోతుంది అన్నది అర్ధమవుతుంది. శ్రీలంక భారత్ మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్లో ఇక భారత జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కు జోడిగా పృద్వి షా ఓపెనర్గా ఆడబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మరో సారి వీరిద్దరి జోడి ఐపీఎల్ భాగస్వామ్యాన్ని మరోసారి రిపీట్ చేస్తారా.. భారీ స్కోర్లు నమోదు చేస్తారా అనే దానిపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇకపోతే ఇక ఎన్నో రోజుల పాటు జట్టుకు దూరం అయిన కుల్దీప్ యాదవ్ ఇక ఇటీవలే శ్రీలంకతో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్లో తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక మరోవైపు శ్రీలంకతో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, కిషన్ కిషన్ లు అంతర్జాతీయ వన్డే ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పాత రికార్డులు కూడా అటు టీమిండియా ఆధిపత్యాన్ని సాధిస్తుంది అని చెబుతుండడంతో టీమిండియా గెలవడం పక్క అని అభిమానులు అందరూ భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి