మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి వరల్డ్ కప్ లో విజయం సాధించాలని టీమిండియా జట్టు ఎంతో కసిగా ఉంది. ఈ క్రమంలోనే కూడా దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు వరకు భారత క్రికెట్ లో రెండుసార్లు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్గా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోనిని టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా జట్టు మెంటార్ గా నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.  ధోని అనుభవం సలహాలు కూడా అటు టీమిండియా వరల్డ్ కప్ గెలవటానికి ఉపయోగపడతాయి అంటూ ఇప్పటికే ఎంతోమంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.


 అంతే కాదు ధోనీని మెంటార్  గా నియమిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఎన్నో సర్వే సంస్థలు కూడా ధోని మెంటార్ గా ఉండటం టీమిండియాకు లాభమా కాదా అనేదానిపై సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో అటు విరాట్ కోహ్లీ టీ20 లకు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో కోహ్లీ తర్వాత టీమిండియాకు ఎవరు కెప్టెన్గా ఉంటే బాగుంటుంది అనే దానిపై కూడా పలు సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే పబ్లిక్ కి ఆవాజ్ అనే సంస్థ ధోనీ మెంటార్ గా ఉండడం లాభమా కాదా అనే దానిపై సర్వే నిర్వహించింది. అంతేకాకుండా కోహ్లీ తర్వాత ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనే దానిపై కూడా అభిప్రాయాన్ని అడిగింది.


 ఇక ఈ సర్వేలో 65 శాతం మంది ధోని మెంటార్ గా వరల్డ్ కప్ లో టీమ్ ఇండియాకు వ్యవహరించడం ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక అంతే కాకుండా విరాట్ కోహ్లీ తర్వాత ఎవరు కెప్టెన్సీ బాధ్యతలను తీసుకుంటే బాగుంటుంది అనే దానిపై కూడా ఎక్కువ శాతం మంది ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 69.4 శాతం మంది వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 58 శాతం మంది వరల్డ్ కప్ లో టీమిండియా గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: