ఇలాంటి సమయంలో టీమిండియాకు మొదట్లోనే ఊహించని షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రోహిత్ శర్మ గాయం కారణంగా సౌత్ ఆఫ్రికా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. దీంతో ఇక కీలక ఆటగాడిని దూరం చేసుకున్న టీమిండియా కాస్త బలహీనపడింది. అయితే రోహిత్ శర్మకు సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా అటు వైస్ కెప్టెన్గా కూడా ప్రమోషన్ వచ్చింది. ఇక రోహిత్ శర్మ గాయం బారినపడి దూరం కావడంతో ఇక రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ కు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది
అయితే కేఎల్ రాహుల్ ఇప్పటికే టి20లో వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే రోహిత్ గాయం కారణంగా టెస్టు సిరీస్ కు దూరం కావడంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ కు అవకాశం కల్పించామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్పై అందరి దృష్టి ఉంది అని చెప్పాడు. మరి కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుందా లేదా అన్నది చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి