దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు వెలువడింది. ఫిబ్రవరి 12 మరియు 13 వ తేదీలలో బెంగుళూరు వేదికగా ఈ మెగా వేలం జరగ నుంది. ఇందుకోసం కొన్ని విషయాలను బీసీసీఐ దేశవాళీ బోర్డ్స్, అంతర్జాతీయ బోర్డులకు తెలిపింది. ఎవరైతే ఐపీఎల్ 15 సీజన్ లో ఆడాలని అనుకుంటారో వారు నిర్ణీత గడువు లోపు వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపింది. ఇందు కోసం జనవరి 17 వ తేదీ వరకు సమయాన్ని ఇచ్చింది. ఈ లోపు మాత్రమే ప్రపంచంలో ఉన్న ఏ ప్లేయర్ అయినా ఇక్కడ ఆడేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇది ఇప్పుడిప్పుడే తమ టాలెంట్ తో ఆకట్టుకుంటున్న కుర్రాళ్లకు మంచి అవకాశం అని చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని ఎంత మంది వాడుకుంటారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న లీగ్ లలో రాణించిన ఆటగాళ్లకు మంచి ధర పలికే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఎవరెవరు అత్యధిక ధరను పొందుతారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి