ఇంగ్లాండ్ క్రికెట్ టీం.. ఈ పేరు చెబితే చాలు అటు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ప్రపంచ కప్ క్రికెట్ లో ఇది ఒక ఛాంపియన్ టీం.  ఎప్పుడు బరిలోకి దిగిన విజయాల వైపు దూసుకు పోతూ ఉంటుంది. ప్రత్యర్థి ఎవరైనా చిత్తుగా ఓడించటం ఇంగ్లాండ్ టీం కి వెన్నతో పెట్టిన విద్య. బౌలింగ్,బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కూడా ఆరితేరిన జట్టుగా ప్రపంచ క్రికెట్లో ఎంతగానో గుర్తింపు సంపాదించింది. ఇప్పటివరకు ఎన్నో సార్లు ప్రపంచ కప్ లో కూడా అద్భుత ప్రదర్శన చేసి ఎన్నోసార్లు విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచ క్రికెట్లో ఇంగ్లాండు ఒక మేటి జట్టుగా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఏమైంది.. ప్రపంచ చాంపియన్ ఎందుకు ఇప్పుడు  తడబడు తుంది.



ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే ఇంగ్లాండ్ జట్టు కనీస పోటీని కూడా ఇవ్వకుండా ఎందుకు పేలవా ప్రదర్శన చేస్తోంది. ఇంగ్లాండ్ చరిత్రలో ఎన్నడూ లేని ఘోర పరాభవం  ఎందుకు మూటగట్టుకుంది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇటీవలే యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టు క్రికెట్ చరిత్రలోనే ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఏ దశలో కూడా కనీస పోటీ ఇస్తున్నట్లు కనిపించలేదు ఛాంపియన్ జట్టు. చిన్న జట్లు సైతం అద్భుతంగా రాణిస్తున్న వేళ ప్రపంచ క్రికెట్లో దిగ్గజ ఇంగ్లాండ్ జట్టు పేలవా ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


 ఇటీవలే యాషెస్ సిరీస్లో చిత్తుగా ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టు ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే కేలండర్ లో అత్యధిక టెస్టులు లో ఓడిపోయిన జట్ల జాబితాలో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టు ముందు వరుసలోకి రావడం గమనార్హం.  ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు బంగ్లాదేశ్ జట్టు పేరిట ఉండేది ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఈ రికార్డును సమం చేసింది. ఈ ఏడాదిలో ఇంగ్లాండ్ జట్టు ఓడిన టెస్టులు సంఖ్య 9కి చేరిపోయింది. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ ఇప్పటికే మూడు టెస్టులు కూడా ఓడిపోయింది. అది కూడా కనీస పోటీ ఇవ్వలేక చిత్తుగా  ఓడిపోయి ఘోర పరాభవాన్ని చవిచూసింది. గతంలో టీం ఇండియా చేతిలో కూడా ఇలాంటి ఓటమిని చవిచూసింది ఇంగ్లాండ్. దీంతో ప్రస్తుతం ప్రపంచ చాంపియన్షిప్ కు గడ్డు పరిస్థితులు వచ్చాయి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: