టీమిండియాలో ఎన్నో ఏళ్ల పాటు కీలక స్పిన్నర్ గా కొనసాగుతూ తన స్పిన్ బౌలింగ్ తో మాయజాలం సృష్టించాడు హర్భజన్. టీమ్ ఇండియాలో ఎన్నో రికార్డులు సృష్టించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మైదానంలో ఎప్పుడూ దూకుడుగా కనిపించే హర్భజన్ సింగ్ స్పిన్ బౌలింగ్ తో టీమిండియాకు ఎన్నోసార్లు అద్భుతమైన విజయాలు అందించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  కేవలం ఒక బౌలర్ గా మాత్రమే కాకుండా ఇక ఒకవైపు బ్యాట్స్మెన్ గా కూడా తన సత్తా చాటి అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే హర్భజన్ సింగ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.  కేవలం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు మాత్రమే కాకుండా దేశవాళీ క్రికెట్ కూడా హర్భజన్ గుడ్ బాయ్ చెప్పడం గమనార్హం.


 ఈ క్రమంలోనే గతంలో గౌతం గంభీర్ రాజకీయాల్లోకి వెళ్ళినట్లుగా ఇక హర్భజన్ సింగ్ కూడా రాజకీయాల్లోకి వెళ్ళి పోతాడు అని టాక్ వినిపించింది. అయితే తన కెరీర్ గురించి భవిష్యత్తులో అన్ని విషయాలు చెబుతాను అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవలే టీమిండియా లో తనకు నచ్చిన ఆటగాళ్ల గురించి చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్. ప్రస్తుతం భారత జట్టు లో బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ ఓపెనర్ రోహిత్ శర్మ బౌలింగ్ విభాగంలో జస్ప్రిత్ బుమ్రా తన ఫేవరెట్ ఆటగాళ్లు అంటూ హర్భజన్  సింగ్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ ఎంతో గొప్ప ఆటగాడని.. వన్డే టి20 టెస్టుల్లోనూ వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ అంటూ హర్భజన్ సింగ్ తెలిపాడు.


 ఫార్మాట్ తో సంబంధం లేకుండా రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. అలాంటి నైపుణ్యం కేవలం రోహిత్ శర్మ కు మాత్రమే సొంతం అంటూ హర్భజన్ సింగ్ అన్నాడు. అదేసమయంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కె.ఎల్.రాహుల్ కూడా ఉత్తమ స్థాయి క్రికెటర్లు అంటూ హర్భజన్ సింగ్ చెప్పడం గమనార్హం. అయితే వీరితో పోల్చి చూస్తే  రోహిత్ శర్మ  కాస్త భిన్నమైన వాడు అంటూ స్పష్టం చేశాడు. అందుకేనేమో రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు సంపాదించాడు అంటూ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు.  ఇక ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విషయానికి వస్తే టి20లో వన్డేలు లేదా టెస్ట్ క్రికెట్ లో  టాప్ క్లాస్ బౌలర్ అంటూ తెలిపాడు హర్భజన్ సింగ్. అందుకే ప్రస్తుతం టీమిండియా లో వీరిద్దరు నా అభిమాన ఆటగాళ్లు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: