ఇక రోహిత్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్తో ఇక హిట్ మాన్ అనే పదానికి పూర్తి న్యాయం చేస్తాడు అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్ శర్మ జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఉన్నాయి.. అయితే గతంలో ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకున్నా రోహిత్ శర్మ ఇక ఇటీవలే భారత జట్టుకు వన్డే టి20 ఫార్మాట్ కెప్టెన్ గా అవతరించాడు. మరికొన్ని రోజుల్లో టెస్ట్ కెప్టెన్సీ కూడా చేపట్టబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే సరిగ్గా 2020లో ఇదే రోజు రోహిత్ శర్మ ఒక మ్యాజిక్ సృష్టించి టీమ్ ఇండియా కు అరుదైన విజయాన్ని అందించాడు.
దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. న్యూజిలాండ్తో 3వ టి20 టైగా ముగిసింది.ఈ క్రమంలోనే సూపర్ ఓవర్ జరిగింది. ఇక ఏం జరగబోతుందో అని ప్రేక్షకులు మునివేళ్ళపై నిలబడి మ్యాచ్ వీక్షిస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు సూపర్ ఓవర్లో 17 పరుగులు చేసింది. ఇక ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నాలుగు బంతుల్లో 8 పరుగులు చేసింది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారిపోయింది. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి టీమిండియాకు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి