టీమిండియాలో సీనియర్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో అయితే తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. అయితే టీమిండియాలో ఎంతోమంది స్పిన్నర్లు ఉన్నప్పటికీ మిగతా స్పిన్నర్ల తో పోల్చి చూస్తే అటు రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్ మాత్రం కాస్త డిఫరెంట్ అని చెప్పాలి. అంతేకాదు బ్యాట్స్మెన్  కి  తగ్గట్లుగా ఎంతో తెలివిగా బౌలింగ్ చేయడంలో అశ్విన్ తరువాతే ఎవరైనా అని చెప్పాలి.


 ఇక అలాంటి రవిచంద్రన్ అశ్విన్ కొంతకాలం నుంచి టీమ్ ఇండియా ఆడిన ప్రతి టెస్టు మ్యాచ్ లో కూడా భాగం అవుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కేవలం జట్టులో భాగం అవడమే కాదు  జట్టు విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇటీవల తన 435  వికెట్ తీసి భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ రికార్డును అధిగమించాడు అనే విషయం తెలిసిందే.   ఇప్పుడు మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు ఈ సీనియర్ స్పిన్నర్. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టడం తో అశ్విన్ ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి.



 గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో 71 వికెట్లు సాధించిన రవిచంద్రన్ అశ్విన్.. ఇక 2022 - 23 లో ఇరవై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇప్పుడు వరకు 21 మ్యాచ్ లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ వంద వికెట్లు సాధించడం గమనార్హం. అశ్విన్ తర్వాత ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఉండడం గమనార్హం. 20 టెస్ట్ మ్యాచ్లు ఆడిన పాట్ కమిన్స్ తొంభై మూడు వికెట్లు తీసి ప్రస్తుతం రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇలా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 100 వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సాధించడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: