ప్రతి సిరీస్ లో కూడా విజయం సాధిస్తూ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి టీమిండియా స్వదేశంలోనే వరసగా సిరీస్ను ఆడుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన విజయాలను నమోదు చేస్తోంది. ఇటీవలే శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో కూడా ప్రత్యర్థి శ్రీలంక జట్టును క్లీన్స్వీప్ చేసింది కాగా విజయం అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మా విజయ పరంపర బాగుంది.. వ్యక్తిగతంగా జట్టుగా కూడా నేను వీటిని ఆస్వాదిస్తూ ఉన్న.. జట్టులోని సీనియర్ సభ్యులు కూడా కెప్టెన్సీ బాధ్యతలకు సహకరిస్తూ ఉన్నారు. రవీంద్ర జడేజా,శ్రేయస్ అయ్యర్,రిషబ్ పంత్, అశ్విన్ అందరూ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేసే సత్తా కలిగిన బుమ్రా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హనుమ విహారి కూడా బాగా ఆడాడు అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడమే లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓడటం మాత్రం టీమిండియా అవకాశాలకు దెబ్బతీసాయ్ అని చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి