ఈ ఏడాది అంచనాలకు అందని విధంగా ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లు అద్భుతంగా రాణిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మొదటి నుంచి వరుస విజయాలు సాధిస్తూ టేబుల్ టాపర్ గా అవకాశాలు దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్ జట్టు. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తూ విజయాలు సాధించడంపై టీమిండియా మాజీ ఆటగాడు  సునీల్ గవాస్కర్  ప్రశంసల వర్షం కురిపించాడు. గుజరాత్ తొలి తొమ్మిది మ్యాచ్ లలో ఎనిమిది విజయాలు సాధించి తిరుగులేని విధంగా ముందుకు సాగింది. కానీ చివరి రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే గుజరాతి 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక  గుజరాత్ టైటాన్స్ జట్టు ఇంకా 3 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.


 ఏ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించిన అటు అధికారికంగా గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్నట్లు అవుతుంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ జట్టు ఆటతీరుపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతు.. గుజరాత్ టైటాన్స్ భయం లేకుండా అద్భుతంగా ఆడుతున్నారు. ఫలితం గురించి పెద్దగా ఆలోచించకుండా ఆటను కొనసాగిస్తున్నారు. తమ తీరు గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అని భయం వారిలో ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ఆ జట్టు విజయం సాధించగలుగుతూ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్. ఫలితం గురించి ఆలోచించకుండా అందరూ ఆటగాళ్లు ఎంతో పాజిటివ్ క్రికెట్ ఆడుతున్నారు అని ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl