గత కొంత కాలం నుంచి పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న పృథ్వీ షా  గురించి ఎంతో మంది విమర్శలు చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు పృథ్వీ షా ఫిట్నెస్ టెస్టులో కూడా ఫెయిల్ కావడంతో మరిన్ని విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ లోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం  ఇవి అద్భుతమైన ఇన్నింగ్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్గా ప్రతి మ్యాచ్లో కూడా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.  కానీ ఇటీవలే జ్వరం కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు పృథ్వీ షా. దీంతో అతనికి ఏమైంది అని అభిమానులు అందరూ ఆందోళనలో మునిగిపోయారు.


 దీంతో ఇక ఈ యువ ఆటగాడు లేకుండానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇటీవలే రాజస్థాన్ రాయల్స్  తో మ్యాచ్ ఆడింది. పృథ్వీ షా స్థానంలో తెలుగు ఆటగాడు భరత్ను తీసుకున్న అతను బాగా రాణించలేకపోయాడు.  ఇక ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. మిచెల్ మార్ష్ 89 పరుగుల తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ వార్నర్ 52 పరుగులు చేశాడు. అయితే ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో విజయం తర్వాత అటు రిషబ్ పంత్ పృథ్వీషా ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చాడు. పృథ్వీ షా ను మేము చాలా మిస్ అవుతున్నామూ. అతను టైఫాయిడ్ జ్వరంతో బాధ పడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం పృథ్వీషా కోలుకుంటున్నాడు. అయితే ఈ సీజన్లో మిగతా మ్యాచ్లు ఆడతాడా లేదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేము.  రాజస్థాన్లో జరిగిన మ్యాచ్లో విజయం ఎంతో కీలకం. బౌలింగ్ ఎంచుకున్న మంచి పని చేసాం.. ప్రత్యర్థిని  తక్కువ పరుగులకే కట్టడి చేసి ఇక ఎంతో సమర్థవంతంగా చేదన చేయగలిగామూ అంటు రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl