ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. అయితే అటు స్టేడియం కు వెళ్ళిన ప్రేక్షకులకు స్వయంగా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. కానీ టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకూ మ్యాచ్ కి సంబంధించి అసలుసిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు అటు కెమెరా మెన్ లూ ఎంతగానో కష్టపడి పోతూ ఉంటారు అని చెప్పాలి.  ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రతి విషయాన్ని తమ కెమెరాలతో క్యాప్చర్ చేస్తూ ఉంటారు. వికెట్ పడినప్పుడు, సిక్సర్ కొట్టినప్పుడు  ఆటగాళ్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు  ఇక ప్రేక్షకులు రియాక్షన్ ఏంటి అన్న విషయాలను కెమెరాలో క్యాప్చర్ చేస్తూ వాటిని టీవీలో చూపిస్తూ ఉంటారు.


 ఇలా టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకుడు సైతం ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తున్నాము అనే భావన కలిగే విధంగా కెమెరామెన్  పనితనం  చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది కెమెరా మెన్ లూ మైదానంలో  జరుగుతున్న మ్యాచ్ కంటే స్టేడియంలో మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్నా అందమైన అమ్మాయిలను చూపించడమే టార్గెట్గా పెట్టుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ కాపిటల్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది అని తెలుస్తోంది. మ్యాచ్ ఉత్కంఠ భరితంగా   జరుగుతున్న సమయంలో ఒక కెమెరామెన్ మ్యాచ్ కవర్ చేయకుండా అక్కడ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా అమ్మాయిలను కవర్ చేస్తూ కనిపించాడు.


 కెమెరామాన్ వెనకాల ఉండి మ్యాచ్ వీక్షిస్తున్న ఒక ప్రేక్షకుడు సెల్ఫోన్ లో ఇదంతా చిత్రీకరించాడు. ఇక దీని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. దీనిపై అటు నెటిజన్లు  భిన్నంగా స్పందిస్తున్నారు అనే చెప్పాలి. స్టేడియం లో ఉన్న అందమైన అమ్మాయిలను పట్టుకునేందుకు కెమెరామన్ ప్రయత్నిస్తున్నాడు అంటూ కొంతమంది కామెంట్  పెడుతూ ఉంటే.. అక్కడున్న అమ్మాయిని చూసి కెమెరా మెన్ ప్రేమలో పడిపోయాడు అందుకే ఆమెకు తెలియకుండా సీక్రెట్ గా ఆమెను చూస్తూ ఉన్నాడు అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: