సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన జమ్మూకాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ ప్రతిభతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. కొంత మంది ఫాస్ట్ బౌలర్లకు మాత్రమే సాధ్యమైన 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ.. అందరినీ ఔరా అనిపించాడు. ఐపీఎల్లో 157 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఫాస్ట్ డెలివరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో అతన్ని వెంటనే టీమిండియా లోకి తీసుకోవాలంటూ డిమాండ్ ఎక్కువయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసింది బిసిసీఐ. ఇటీవలే ఉమ్రాన్ మాలిక్ ప్రతిభపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఉమ్రాన్ మాలిక్ భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతడు ఫిట్నెస్ కాపాడుకుంటూ వేగంగా బంతులు వేస్తే ఖచ్చితంగా సుదీర్ఘకాలంపాటు ఆడతాడు అనే నమ్మకం మాత్రం నాకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. ముంబై నుండి తిలక్ వర్మ, హైదరాబాద్ నుంచి రాహుల్ త్రిపాఠీ, గుజరాత్ నుంచి రాహుల్ తేవాటియా, సన్రైజర్స్ నుంచి ఉమ్రాన్ మాలిక్, మోసిన్ ఖాన్, హర్ష దీప్ సింగ్, ఆవేష్ ఖాన్ వంటివారు అద్భుతంగా రాణిస్తూ ఉండటం మనం చూశాము.


 క్రికెట్ లో టీ20 లీగ్ అనేది ప్రతిభను ఎంతవెలికి తీసే వేదిక అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ యువ ఆటగాళ్లు అందరూ కూడా అవకాశం దక్కించుకున్న దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ టి 20 సిరీస్ లో భాగంగా ఎవరు ఎలా రాణిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. సీనియర్లు గా ఉన్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు బీసీసీఐ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నారు అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: