అప్పటికే టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో దినేష్ కార్తీక్ లాంటి హిట్టర్ ను బ్యాటింగ్ కి పంపకుండా అక్షర్ పటేల్ ను పంపడం ఏంటి అంటు విమర్శలు గుప్పించారు ప్రేక్షకులు. అయితే ఇలా దినేష్ కార్తీక్ కంటే ముందు అక్షర్ పటేల్ ని బ్యాటింగ్ కు పంపడానికి గల కారణం ఏంటి అన్న విషయంపై టీమిండియా కీలక ఆటగాడు శ్రేయస్ స్పందించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడేందుకు తాము ముందుగానే నిర్ణయం తీసుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చే సమయంలో ఏడు ఓవర్లు మిగిలి ఉన్నాయి.
ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రోటేట్ చేయగల ఆటగాడు కావాలని అనుకున్నాం. అంతేకానీ ఇక క్రీజు లోకి రావడం రావడమే ఎడాపెడా సిక్సర్లు కొట్టే ఆటగాడు వద్దు అని అనుకున్నాం.. అందుకే అక్షర్ పటేల్ ని ముందుగా పంపించాము అంటూ చెప్పుకొచ్చాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్ లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ రెండవ టీ 20 మ్యాచ్లో క్రీజులోకి వచ్చిన తర్వాత కాస్త ఇబ్బంది పడ్డాడు. కాగా సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి