టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ ఈనెల 1వ తేదీన తన ప్రేయసి జయ భరద్వాజ్  ఆగ్రాలో కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే గత ఏడాది అందరి సమక్షంలో ఐపీఎల్ మైదానంలో ప్రపోజ్ చేసి అభిమానులను  సర్ప్రైజ్ చేసిన దీపక్ చాహర్ ఇక ఈ ఏడాది పెళ్లి తో తన ప్రేమకు ప్రమోషన్ ఇచ్చేశాడు.  అయితే ఇటీవల దీపక్ చాహర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన భార్య జయా భరద్వాజ్ తో కలిసి డాన్స్ చేసిన ఒక వీడియో ని పంచుకున్నాడు.


 అదిరిపోయే పాటలపై భార్యాభర్తలు ఇద్దరూ కూడా అద్భుతంగా డాన్స్ స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఇందుకోసం స్పెషల్ కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దీపక్ చాహర్ క్రికెట్ మ్యాచ్ కంటే డాన్స్ చేయడం చాలా ఒత్తిడితో కూడుకున్నది అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. కాక దీపక్ చాహర్  వ్యక్తిగత జీవితం సాఫీగా సాగిపోతున్న క్రికెట్ కెరియర్  మాత్రం ఎత్తుపల్లాలను చూస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఏకంగా 14 కోట్లకు దీపక్ చాహర్  ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అయితే గాయం కారణంగా అతను సిరీస్కు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అంతకు ముందు వెస్టిండీస్తో జరిగిన టి20 అద్భుతంగా రాణించాడు. అదే సిరీస్ లో ఇక గాయం అయ్యింది. ప్రస్తుతం బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే దీపక్ చాహర్ గాయం తీవ్రతరమైందని తెలుస్తుంది.  ఇక  మరో నాలుగు నెలలు లేదా ఐదు నెలల పాటు ఆయన క్రికెట్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే అక్టోబర్ లో జరిగే టి20 వరల్డ్ కప్  కు దూరమయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: