కోహ్లీ అంటేనే అగ్రేసీవ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. మైదానంలో దూకుడు గా ఉంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అదే రీతిలో అగ్రేసీవ్ గా స్పందిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లీకి కోపం వస్తే ఎలా  ఉంటాడు అనే విషయానికి కేరాఫ్ అడ్రస్ గా ఒక వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జులై 1వ తేదీన ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా.


 టెస్ట్  తర్వాత వన్డే టి20 సిరీస్ లు కూడా ఆడుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లిస్టర్ షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో మునిగితేలుతోంది. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ సిరీస్ కోసం టీమిండియా నెట్ బౌలర్గా కమలేష్ నాగర్కోటి ఎంపికయ్యాడు. కాగా వార్మప్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కమలేష్ నాగర్కోటికి ప్రేక్షకుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.  స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా బౌండరీ లైన్ వద్ద ఫీలింగ్ చేస్తున్నాడు కమలేష్. ఒక వ్యక్తి కమలేష్ ని పిలిచే ప్రయత్నం చేశాడు.


 ఇక మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కమలేశ్ స్పందించలేదు. అయినప్పటికీ ఊరుకోకుండా తనకు సెల్ఫీ ఇవ్వాలి అంటూ గోల గోల చేసాడు. ఇక ఇదంతా స్టాండ్స్ నుంచి చూస్తున్న కోహ్లీ కోపం పట్టలేక పోయాడు. ఎందుకు అతన్ని విసిగిస్తున్నావ్ అంటూ సదరు వ్యక్తిని నిలదీసాడు. నేను ఫోటో ఇవ్వమని అడిగానని విసిగించటం లేదు అంటూ సదరు వ్యక్తి సమాధానం చెప్పాడు. అతను మ్యాచ్ కోసమే ఇక్కడికి వచ్చాడు నీ కోసం కాదు అంటూ విరాట్ కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: