ప్రస్తుతం పాకిస్థాన్ కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ అజం ప్రపంచ క్రికెట్లో తన హవా కొనసాగిస్తున్నాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతున్న బాబర్ అజం ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా బద్దలు కొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అత్యుత్తమ ఆటగాడు గా కొనసాగుతున్న బాబర్ తన స్థానాన్ని ప్రతి ఏటా కాపాడుకుంటూ వస్తున్నాడు అని చెప్పాలి. ఒకవైపు టీమిండియాను ఎంతో అద్భుతంగా ముందుకు నడిపిస్తునే మరోవైపు ఒక ఆటగాడిగా కూడా జట్టుకు విజయాలను అందించేందుకు 100% కష్టపడుతున్నాడు.


 ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సాధించిన ఎన్నో రికార్డులను ప్రస్తుతం చేదించడమే లక్ష్యంగా పెట్టుకున్న బాబర్ అజం వరుసగా ఒక్కో రికార్డును బద్దలు కొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఐసీసీ ప్రకటించిన టీ 20 ర్యాంకింగ్స్ లో 818 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం గా ఉంచుకున్నాడు. ఇక ఇటీవల అరుదైన రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. టి20 ర్యాంకింగ్స్ లో అత్యధిక కాలం పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన బ్యాట్స్మెన్గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు పాకిస్తాన్ కెప్టెన్.


 గతంలో ఈ అరుదైన రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. విరాట్ కోహ్లీ ఏకం లో ఒక వెయ్యి 13 రోజుల పాటు టి20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగగా.. ఇక ఇప్పుడు బాబర్ అజం ఈ రికార్డును బద్దలు కొట్టి కోహ్లీని వెనక్కు నెట్టాడు. ఈ ఏడాది కేవలం రెండు టి 20 మ్యాచ్ లు మాత్రమే అడిన కోహ్లీ  తాజా ర్యాంకింగ్స్ లో 21 స్థానానికి పడిపోగా.. బాబర్ అజం తన రేటింగ్ పాయింట్లు మెరుగు పరుచుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఇక ఈ లిస్ట్ చూసుకుంటే బాబర్ అజం తర్వాత  పాక్‌ వికెట్‌కీపర్‌ మహ్మద్ రిజ్వాన్ (794) రెండవ స్థానంలో  ఉన్నాడు .టీమిండియా నుంచి ఇషాన్‌ కిషన్‌ (682) ఒక్కడికే టాప్ టెన్ లో స్థానం లభించింది. గత వారం ర్యాంకింగ్స్‌లో 6వ ప్లేస్‌లో ఉన్న ఇషాన్‌.. ఓ స్థానం కోల్పోయి ఏడవ స్థానానికి పడిపోయాడు. తర్వాత మార్క్రమ్‌ (757), డేవిడ్‌ మలాన్‌ (728), ఆరోన్‌ ఫించ్‌ (716), డెవాన్‌ కాన్వే (703), పథుమ్‌ నిస్సంక (661), మార్టిన్‌ గప్తిల్‌ (658), డెస్సెన్‌ (658) వరుసగా  10 స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: