భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఇక ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. టీమిండియా విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. ఈ క్రమం లోనే ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి వ్యూహాలను అమలులోకి తెస్తే బాగుంటుంది అన్న విషయంపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ ఆటగాడు చటేశ్వర్ పుజారా పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా ఎన్నోసార్లు భారత జట్టును గెలిపించాడు. అయినప్పటికీ అతని ఇన్నింగ్స్ లకు సరైన గుర్తింపు రాలేదు అంటూ హర్భజన్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అందరూ ఐపీఎల్ లో ఆడుతున్న సమయంలో.. చటేశ్వర్ పుజారా ఇంగ్లాండ్ కౌంటి ల్లో ఆడుతూ తిరిగి  ఫామ్ పొందాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక చటేశ్వర్ పుజారా కు ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఎక్కువ ఆడిన అనుభవం ఉంది అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. అయితే పూజారా ఆడిన కౌంటీ క్రికెట్ లో ఉన్న బౌలర్ల కంటే అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న బౌలర్ల మెరుగ్గా ఉండవచ్చు అని అందరూ అనుకుంటారు.


 కానీ కౌంటీ క్రికెట్ లో కూడా ఒకరిద్దరు అంతర్జాతీయ బౌలర్లు ఉంటారు. అయితే కౌంటీ క్రికెట్లో మళ్లీ ఫామ్ అందుకున్న చటేశ్వర్ పుజారా.. ఇక ఇప్పుడు భారత జట్టు విజయానికి తన వంతు సహకారం అందిస్తాడు. అయితే మేము ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు పూజారా రాణిస్తారని ఎవ్వరు కూడా ఊహించలేదు. కానీ భారత జట్టు విదేశాల్లో పర్యటించినప్పుడు పుజారా అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌన్సీ పిచ్లపై పుజారాకు పరుగులు సాధించే సత్తా ఉంది. ఇంగ్లండులో పుజారా కంటే ఎవరు మెరుగ్గా రాణించలేరు అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: