ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు  శ్రీలంక పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే.  అయితే ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక తో వన్డే సిరీస్ ఆడుతోంది. మిథాలీ రాజ్ అటు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ లో ఆడుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక శ్రీలంక తో వన్డే సిరీస్ లో భాగంగా ఇటీవలే మొదటి వన్డే మ్యాచ్ గెలిచింది భారత మహిళల జట్టు. ఇలా శ్రీలంకకు సొంతగడ్డపైనే షాక్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే నేడు రెండో వన్డే మ్యాచ్ జరగబోతోంది. ఈ వన్డే మ్యాచ్ పై ప్రతి ఒక్కరిలో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే మొదటి వన్డే మ్యాచ్ లో గెలిచిన భారత మహిళల జట్టు ఇక రెండో వన్డే మ్యాచ్లో కూడా గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇలా సొంతగడ్డపైనే శ్రీలంక జట్టుకు షాక్ ఇవ్వాలని చూస్తుంది. దీంతో ఇక ఈ రెండో వన్డే మ్యాచ్ కాస్తా ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇప్పటికే అటు బౌలింగ్ విభాగంలో ఇటు బ్యాటింగ్ విభాగంలో కూడా టీమిండియా జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది అన్న విషయం తెలిసిందే.



 పల్లెకెలే వేదికగా నేడు ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే మరింత ఆసక్తిని సంతరించుకుంది.  ఇక ఈ మ్యాచ్ కోసం అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. అయితే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న భారత మహిళల జట్టు ప్లాన్ ప్రకారం రెండో వన్డే మ్యాచ్ లో గెలవాలని భావిస్తూ ఉంటే.. ఇక రెండో వన్డే మ్యాచ్లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనీ భావిస్తోంది శ్రీలంక జట్టు. దీంతో ఇక పోరు మరింత హోరాహోరీగా జరగబోతుంది అని మాత్రం తెలుస్తోంది.  ఇక ఇప్పటికే శ్రీలంక పై ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు ఇక టీ20 సిరీస్ లో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: